Begin typing your search above and press return to search.
అయ్యయ్యో ఇదేందయ్యా..! వధువు దొరకడం కోసం ఇలా చేస్తారా?
By: Tupaki Desk | 10 Jan 2022 8:42 AM GMTఒకప్పుడు వివాహం కోసం అబ్బాయిలను బాగా వెతికేవారు. అమ్మాయికి పెళ్లి చేయాలంటే సరి జోడు కోసం తెలిసిన ప్రతి వారిని వరుడు కావాలని అడిగేవారు. కానీ కాలం మారింది. పెళ్లి సంబంధాల రూటు మారింది. ఇప్పుడు అమ్మాయిల కోసం అబ్బాయిలు వెతుకుతున్నారు. వధువు వేటలో విసిగిపోయి... వింతైన సంఘటనలు చేస్తున్నారు. ఓ యువకుడు తనకు వధువు కావాలని ఏకంగా ఏ పెద్ద హోర్డింగ్ పెట్టించాడు. మంచి అమ్మాయిని చూసి పెట్టండంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.
భారతీయ పాకిస్తాన్ యువకుడు మహమ్మద్ మాలిక్ బ్రిటన్ లో నివాసం ఉంటున్నారు. మంచి ఉద్యోగం చేస్తున్న ఆ యువకుడికి మాత్రం ఇప్పటివరకు తనకు సెట్ మహిళ దొరకలేదట. పెళ్లి చేసుకునేందుకు వధువు కోసం వెతుకుతూ వస్తున్నాడు. చివరకు బిల్ బోర్డులను ఆశ్రయించాడు. 'నాకు ఒక సరి జోడు చూసి పెట్టండి' అంటూ ఓ హోర్డింగ్ ను తయారు చేయించారు. దానిని లండన్, బర్మింగ్ హమ్ నగరంలో ఏర్పాటు చేశారు. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. తొలుత ఇదేదో సరదా కోసం చేశాడని లైట్ తీసుకున్నారు.
తన వెబ్ సైట్ లో మాలిక్ పూర్తి వివరాలు పొందుపరిచారు. అంతేకాకుండా 'ఇది జోక్ కాదండోయ్... నాకు ఓ వధువును వెతికి పెట్టండి అనే శీర్షికతో ఓ పోస్ట్ చేశాడు.' 'పెళ్లి చేసుకోవడానికి ఇప్పటివరకు నాకు సరైన అమ్మాయి దొరకలేదు. అమ్మాయిని వెతకడం చాలా కష్టంగా మారింది. చాలా యాప్ లో ప్రకటనలు ఇచ్చాను. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను. నా వివరాలు అన్నీ పొందు పర్చాను. కానీ నాకు అమ్మాయి దొరకలేదు. చివరకు నా ఫ్రెండ్ సాయంతో ఈ బిల్ హోర్డింగ్ పెట్టాను.' అని పోస్ట్ చేశారు.
తనకు చాలా మంది యువతుల వివరాలు వచ్చాయని మాలిక్ చెప్పారు. వాటిని పరిశీలించే సమయం తనకు లేదని అన్నాడు. తనకు ఎలాగైనా ఒక అమ్మాయిని వెతికి పెట్టండి అని వేడుకున్నాడు. అయితే ఈ హోర్డింగ్ ఇప్పుడు వైరల్ గా మారింది. అరే ఇదేందిరా... ఇది.. వధువు కోసం ఇలా కూడా చేస్తారా? అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.