Begin typing your search above and press return to search.

వైరల్: కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుడి లేఖ

By:  Tupaki Desk   |   28 Nov 2019 5:25 AM GMT
వైరల్: కేసీఆర్ కు ఆర్టీసీ కార్మికుడి లేఖ
X
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించారు. 52 రోజులు సమ్మె చేసినా కరుణించని కేసీఆర్ తీరుకు ఆవేదనతో మళ్లీ తమదే తప్పు అని మళ్లీ ఉద్యోగాల్లో చేరడానికి వచ్చారు. అయినా కేసీఆర్ ఉద్యోగాల్లోకి తీసుకోవడం లేదు. ఆందోళన చేసినా, ఆవేదన వ్యక్తం చేస్తున్నా కేసీఆర్ కరుణించడం లేదు. దీంతో కడుపుమండిన ఓ ఆర్టీసీ కార్మికుడు ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు. అలా చేస్తూ ఈ సందర్భంగా కేసీఆర్ కు రాసిన లేఖ వైరల్ గా మారింది.

సూర్యపేట ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న ఎల్.కృష్ణ ఉద్యోగానికి రాజీనామా చేస్తూ కేసీఆర్ కు రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తీవ్ర ఆవేదనతో రాసిన ఆ లేఖలో ఎన్నో భావోద్వేగ విషయాలను, తెలంగాణలో దారుణాలను, కేసీఆర్ నియంత పోకడలను అతడు కళ్లకు కట్టాడు.

మీలాంటి మోసకారి, మాటకారి, మానవత్వం లేని మనిషి ఆధ్వర్యంలోని ప్రభుత్వంలో నా ఆత్మభిమానాన్ని చంపుకోలేక ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానని ఆర్టీసీ కార్మికుడు కృష్ణ సంచలన కామెంట్ చేశారు. తెలంగాణలో ఎందుకు పుట్టానురా నాయనా అనే విధంగా తీవ్ర మానసిక వేదినకు గురై నేను రాజీనామా చేసి ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకొని ఉద్యోగం చేయలేనని రాజీనామా చేశానన్నారు. మాట తప్పడం, మాయ మాటలు చెప్పి మోసం చేయడం మీకు తెలుసు అని కార్మికలోకం ఆలస్యంగా తెలుసుకుందని ఆరోపించారు.తెలంగాణలో ఇంత నియంతృత్వం చూస్తాననుకోలేదన్నారు. తెలంగాణ కోసం 1200 ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వచ్చిందని.. కేసీఆర్ హయాంలో బతుకులు బంగారం అవుతాయనుకుంటే ఆంధ్రా పాలకులకంటే కూడా మీరే ఎక్కువగా మోసం చేశారని లేఖలో ఘాటు విమర్శలు చేశారు.

ఎంతో మంది బలిదానాలతో వచ్చిన బంగారు తెలంగాణలో కేసీఆర్ మాత్రమే ఉన్నారని నా ఆర్టీసీ అక్కాచెల్లెళ్ల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని కార్మికుడు కృష్ణ లేఖలో విమర్శించారు. కార్మికులు ఏడుస్తున్నా.. సోదరులు బాధపడుతున్నా తట్టుకోలేకపోతున్నారని.. కేసీఆర్ మాత్రం కరుగడం లేదని ఆరోపించారు.