Begin typing your search above and press return to search.

వైరల్:వీళ్లు కరోనా రోగులు కాదు..కౌంటింగ్ సిబ్బంది

By:  Tupaki Desk   |   2 May 2021 9:30 AM GMT
వైరల్:వీళ్లు కరోనా రోగులు కాదు..కౌంటింగ్ సిబ్బంది
X
కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడు ఎంత తీవ్రంగా దేశంలో ప్రబలుతుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలోనే ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఈరోజు జరుగుతోంది. కరోనా తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో ఎన్నికల సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. మాస్కులు, శానిటైజర్లు వెంట తెచ్చుకున్నారు.

అయితే ఇక్కడ మాత్రం కౌంటింగ్ సిబ్బంది మరో అడుగు ముందుకేశారు. ఏకంగా పీపీఈ కిట్లు ధరించి డ్యూటీకి వచ్చారు. అదే ఇప్పుడు వైరల్ గా మారింది.

కౌంటింగ్ సిబ్బందిని పీపీఈ కిట్లలో చూసిన వారంతా విస్తుపోయారు. వారంతా కరోనా రోగులు కావచ్చని మొదట అనుకున్నారు. ఆ తర్వాత ఆరోగ్య సిబ్బంది అని అనుకున్నారు. కానీ వారంతా కౌంటింగ్ హాల్ లోకి వచ్చి కౌంటింగ్ లెక్కిస్తుండడం చూసి ఆశ్చర్యపోయారు.

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సిబ్బంది కోవిడ్ నిబంధనలను పకడ్బందీగా పాటిస్తున్నారు. ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలోని రాయిగంజ్ పాలిటెక్నిక్ కాలేజీ దగ్గర కౌంటింగ్ సిబ్బంది ఇలా పీపీఈ కిట్లు ధరించి కౌంటింగ్ కు హాజరయ్యారు. ఈ పరిణామం చూసి అందరూ షాక్ అయ్యారు. వీరి ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి.