Begin typing your search above and press return to search.
వైరల్ వీడియోః ట్రెడ్ మిల్ లో ఇరుక్కు చిన్నారి.. చూస్తే వెన్నులో వణుకే!
By: Tupaki Desk | 20 April 2021 9:56 AM GMTట్రెడ్ మిల్ తో పెద్దలకు ఆరోగ్యం లభిస్తుందని మాత్రమే చాలా మందికి తెలుసు. కానీ.. పిల్లల ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందన్న సంగతి చాలా మందికి తెలియదు. అమెరికన్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేఫ్లీ కమిషన్ (సీపీఎస్సీ) పోస్టు చేసిన ఓ వీడియోను చూస్తే గండె ఆగినంత పనవుతుంది.
సీపీఎస్సీ పోస్టు చేసిన వీడియోలో.. ఓ ఇంట్లో ట్రెడ్ మిల్ రన్నింగ్ లో ఉంది. దానిపైన ఐదేళ్లపాప నడుస్తోంది. దాని పక్కన్న సుమారు రెండేళ్ల బాబు బాల్ తో ఆడుకుంటున్నాడు. ఆ బాబు బాల్ తో ట్రెడ్ మిల్ వద్దకు రాగా.. బాల్ ను లాగేసుకుంది. బాల్ బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. అందులో రెండు చేతులూ ఇరుక్కుపోయాయి.
వెంటనే పైనున్న పాప.. పేరెంట్స్ ను తీసుకురావడానికి పరిగెత్తింది. అయితే.. తీవ్ర ప్రయత్నంతో రెండు చేతులను వెనక్కు లాక్కున్నాడు ఆ బాలుడు. కానీ.. వెంటనే మళ్లీ బాలున్ని లాగేసుకుంది ట్రెడ్ మిల్. ఈ సారి చేతులే కాదు.. మనిషి మొత్తం ట్రెడ్ మిల్ కిందకు వెళ్లిపోయాడు.
తీవ్రంగా పోరాడి.. వెనక్కు రావడంతో ఈ వీడియో చూసినవారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది. ఇలాంటి ఘటనలు అమెరికాలో సుమారు 40 వరకు నమోదయ్యాయి. అందులో ఒకరు చనిపోయారు. మిగిలిన వారిలో చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో ట్రెడ్ మిల్ ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సీపీఎస్సీ హెచ్చరించింది.