Begin typing your search above and press return to search.
వైరల్ వీడియో: భారత జెండా పట్టుకోవడానికి నిరాకరించిన అమిత్ షా కుమారుడు
By: Tupaki Desk | 29 Aug 2022 10:35 AM GMTదేశానికి హోంమంత్రి.. దేశ రక్షణ ఆయన బాధ్యత.. అమిత్ షా మాటల్లోనూ అది తొణికిసలాడుతుంది. దేశం కోసం ప్రాణాలైన ఇస్తాననే పెద్ద మనిషి కడుపున పుట్టిన వ్యక్తి, బీసీసీఐ కార్యదర్శి మాత్రం విదేశాల్లో భారత జెండా పట్టుకోవడానికి తటపటాయించాడు. భయపడ్డాడు. ఇది కెమెరాకు చిక్కడంతో అడ్డంగా బుక్కయ్యాడు.
చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఆదివారం హోరాహోరీ పోరు సాగింది. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా తన సంచలన ఆటతో టీమిండియాను విజయపథంలో నడిపించాడు. చివరి ఓవర్ లో సిక్స్ కొట్టి ఓడుతుందనుకున్న భారత్ ను గెలిపించారు. భారత విజయం తర్వాత దుబాయ్ స్టేడియం సహా మన దేశమంతటా సంబరాలు అంబరాన్నంటాయి.
ఈ భారత్, పాకిస్థాన్ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరగడంతో స్టేడియం హోరెత్తింది. ఈ మ్యాచ్ చూడడానికి బీసీసీఐ గౌరవ కార్యదర్శి జే షా కూడా వచ్చాడు. టీమిండియా గెలుస్తుందా? లేదా? అని ఆద్యంతం ఆయన ఉత్కంఠతో చూశారు.
టీమిండియా విజయం తర్వాత, జైషా తన కుర్చీలో నుండి నిలబడి చప్పట్లు కొడుతూ ఆ క్షణాన్ని అభిమానులతో కలిసి ఉత్సాహపరిచాడు. అయితే ఓ విచిత్ర దృశ్యం కెమెరాకు చిక్కడంతో వైరల్‌గా మారింది.
ఒక వ్యక్తి టిమిండియా విజయం తర్వాత తన దగ్గరున్న త్రివర్ణ పతాకాన్ని జైషాకు అందజేయడానికి ప్రయత్నించినప్పుడు ఆయన జెండాను పట్టుకోవడానికి నిరాకరించాడు. అది చూసిన నెటిజన్లకు.. అందించిన వ్యక్తి వింతగా.. దిగ్భ్రాంతికరంగా మారింది. ఇది భారత జెండాను తీసుకోవడానికి జే షా ఎందుకు ఇష్టపడలేదు అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు.
నెటిజన్లు జై షా చేసిన పనిని నిందిస్తూ సోషల్ మీడియాలో ఆడిపోసుకుంటున్నారు. టీమిండియాకు గౌరవ సూచకంగా జెండా పట్టుకుని ఊపడానికి ఎందుకు సిగ్గుపడుతున్నారని ప్రశ్నించారు. దేశ హోంమంత్రి కొడుకు ఇలాంటి ఘటనల్లో తప్పించుకోలేడని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు., ఇదే పరిస్థితిలో బీజేపీయేతర వ్యక్తి అయితే బీజేపీ.. బీజేపీ ఐటీ విభాగం పెద్ద వివాదాన్ని సృష్టించి ఉండేదని కొందరు కామెంట్ చేస్తున్నారు. అమిత్ షా కొడుకు కాబట్టే మీడియా హైలెట్ చేయడం లేదని.. ఇది బీజేపీకి అవమానమేనంటూ టీఆర్ఎస్ ఐటీ సెల్ ఇన్ చార్జి సైతం ట్వీట్ చేసి ఎండగట్టారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.