Begin typing your search above and press return to search.
మోడీ వీడియో వైరల్ అయిందిగా?
By: Tupaki Desk | 10 March 2018 2:45 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆయన రాజకీయ గురువు, బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ మధ్య చోటచేసుకున్న సందర్భం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న దృశ్యాల్లో మోడీ తన గురువును అవమానించారని నెటిజన్లు ఫైరవుతున్నారు. ‘గురువును విస్మరించిన శిశ్యుడు..’అంటూ ఏకంగా కొందరు నిప్పులు చెరుగుతున్నారు.
ఇంతకీ అసలేం జరిగిందంటే...త్రిపుర కొత్త సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ అగర్తలాలోని అసోం రైఫిల్స్ మైదానంలో శుక్రవారం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ ముఖ్యనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషి.. తదితరులు సహా పార్టీ ముఖ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు. విప్లవ్ వ్యక్తిగత ఆహ్వానం మేరకు త్రిపుర తాజా మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా వేదిక ఎక్కారు. కాగా, ముఖ్యఅతిథి అయిన మోడీ వేదికపైకి వస్తూ వరుసగా ఒక్కొక్కరికీ ప్రమాణాలు చేస్తూ ముందుకు నడిచారు. అయితే ఈ సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
తొలుత అమిత్ షా, రాజ్‌నాథ్‌లకు నమస్కరించిన ప్రధాని మోడీ.. ఆ పక్కనే అద్వానీవైపు మాత్రం కన్నెత్తి చూడలేదు. చేతులు జోడించి నిల్చున్నప్పటికీ..ఆయన్ను ప్రధాని మోడీ అస్సలేమాత్రం పట్టించుకోకపోవడం అనేది ఈ వీడియోలో వైరల్ అయింది. దీనికి తోడుగా అద్వానీ పక్కనే ఉన్న మాణిక్ సర్కార్‌పై దగ్గరికి వెళ్లి మరీ ఆప్యాయత కురిపించి కాసేపు మాట్లాడారు! ఇదే సమయంలో...అంతసేపూ అద్వానీ చేతులు దండం పెడుతూనే ఉన్నా.. ప్రధాని మోడీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. ఈ పరిణామమే నెటిజన్లు ఫైరయ్యేందుకు కారణంగా మారింది. ఏకంగా బీజేపీ శ్రేణులు సైతం..ప్రధానిపై విమర్శలు చేస్తున్నాయి.
Click Here for The Video : https://www.youtube.com/watch?v=uxlstLUJGhY