Begin typing your search above and press return to search.

భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏంటంటే??

By:  Tupaki Desk   |   27 March 2021 4:30 PM GMT
భార్యకు అరుదైన గిఫ్ట్ ఇచ్చిన విరాట్.. ఏంటంటే??
X
స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్కశర్మ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రేమికులు ఇద్దరూ లవ్ మ్యారేజ్ చేసుకొని అందరిని సర్ప్రైజ్ చేశారు. 2017లో వీరి వివాహం గ్రాండ్ గా ఇటలీ దేశంలో జరిగింది. 2017 డిసెంబర్ 11న అనుష్క - విరాట్ ఇద్దరూ ఇటలీలోని టస్కనిలో ఓ హెరిటేజ్ హోటల్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ తో ఒక్కటయ్యారు. అప్పట్లో ఆ హోటల్ రెంట్ ఒకరోజుకే 13.5లక్షలు చెల్లించారట. మొత్తంగా హోటల్ రెంటే 95 లక్షలకు పైగా అయ్యిందట. ఇదిలా ఉంటే.. విరాట్ తన పెళ్లికి ముందు అనుష్కకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని ప్లాన్ చేసి ఓ డైమండ్ రింగ్ తయారు చేయించాడట. ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జ్యువలరీ డిజైనర్ తో తయారు చేయించిన ఆ రింగ్ ఖరీదు.. కోటి రూపాయలు ఉంటుందని అంచనా.

ఇదిలా ఉండగా.. రెండు నెలల క్రితమే వీరిద్దరూ పేరెంట్స్ అయ్యారు. ఈ క్యూట్ కపుల్ పుట్టిన బిడ్డకు 'వామిక' అనే పేరు పెట్టారు. తాజాగా వామిక పుట్టి రెండు నెలలు పూర్తికావడంతో గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకున్నారు. వీరి కెరీర్ విషయానికి వస్తే.. కోహ్లీ ఆల్రెడీ ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ఆడుతున్నాడు. అలాగే సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు. అనుష్క షారుఖ్ ఖాన్ తో నటించిన జీరో సినిమా లాస్ట్. ఆ తర్వాత ఏ సినిమా ఓకే చేయలేదు. కానీ నిర్మాతగా మారి లాక్ డౌన్ లో వెబ్ సిరీస్ నిర్మించింది. ఇప్పటికే నిర్మాతగా 'పాతాల్ లోక్', 'బుల్ బుల్' వెబ్ సిరీసులు నిర్మించింది. నటిగా అయితే ఇంకా ఏవి ఓకే చేయలేదు. ప్రస్తుతం ఆమె తన బిడ్డను చూసుకుంటూ మాతృబంధాన్ని ఆస్వాదిస్తోంది. కానీ మొత్తానికి ఈ స్టార్ కపుల్ ఎన్నో మిలియన్స్ అభిమానులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.