Begin typing your search above and press return to search.
కోహ్లి నీకో 'వంద'నం.. ఇక అందుకో మరో 'వంద'
By: Tupaki Desk | 3 March 2022 4:30 PM GMTఅది 2006 డిసెంబరు.. ఓ పదిహేడేళ్ల కుర్రాడు రంజీ మ్యాచ్ ఆడుతున్నాడు. వారి జట్టుకు అది కీలక మ్యాచ్. అలాంటి సమయంలో ఆ కుర్రాడికి పెద్ద షాక్. ''మీ నాన్న చనిపోయారు.'' అని.. తన ఎదుగుదలకు ఎంతో శ్రమించిన తండ్రి హఠాన్మరణం ఓవైపు, జట్టును ముందుకు తీసుకెళ్లవల్సిన కర్తవ్యం మరోవైపు.
ఈ పరిస్థితుల్లో ఆ కుర్రాడు కర్తవ్యానికే కట్టుబడ్డాడు. జట్టును గెలిపించాడు కూడా. ఈ వార్త అప్పట్లో ఒకటీ అరా పత్రికల్లో మాత్రమే వచ్చింది. కానీ, అదే కుర్రాడు ఇప్పుడు వందో టెస్టు ఆడుతున్నాడని మీడియా మొత్తం హోరెత్తుతోంది. ఆ కుర్రాడే విరాట్ కోహ్లి. ఎన్నిసార్లు కిందపడినా పైకి లేస్తూ, క్రికెటర్ గా అత్యున్నత శిఖరాలను అధిరోహించి.. దేశానికి గర్వ కారణంగా నిలిచాడు కోహ్లి. ఈ క్రమంలో వందో టెస్టు ఆడనున్న 12వ భారత ఆటగాడిగా చరిత్రకెక్కున్నాడు.
ఆ 11 మంది ఎవరంటే.. సచిన్ టెండూల్కర్ (200), రాహుల్ ద్రవిడ్ (164), వీవీఎస్ లక్ష్మణ్ (134), అనిల్ కుంబ్లే (132), కపిల్ దేవ్ (131), సునీల్ గావస్కర్ (125), దిలీప్ వెంగ్ సర్కార్ (116), సౌరభ్ గంగూలీ (113), వీరేంద్ర సెహ్వాగ్ (103), హర్బజన్ సింగ్ (103), ఇషాంత్ శర్మ (105) తర్వాత వందో టెస్టు ఆడబోతున్న క్రికెటర్ కోహ్లి.
వీరిలో ఇషాంత్ మినహా మిగతా అందరూ రిటైరైనవారే. కోహ్లి సమకాలీకుడైన ఇషాంత్ గతేడాది వందో టెస్టు ఆడాడు. కాగా, వందో టెస్టు ఆడడం అంటే ఆ క్రికెటర్ ''దిగ్గజం'' అన్నట్లే. అయితే, ఇలా భారత క్రికెట్ లో దిగ్గజ హోదా కొద్దిలో కోల్పోయిన ఆటగాడు మహమ్మద్ అజహరుద్దీన్. 99 టెస్టులాడిన అజహర్.. వందో టెస్టు సమయానికి మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంలో కూరుకుపోయాడు. బహిష్కరణకు గురయ్యాడు. ఇప్పటికీ అతడికి వంద టెస్టులు ఆడలేదన్న కోరిక మనసులో బలంగా లోటుగా ఉండిపోయింది.
పడుతూ లేస్తూ..
2008లోనే వన్డే అరంగేట్రం చేసిన కోహ్లి .. టెస్టు జట్టులోకి రావడానికి మరో మూడేళ్ల పట్టింది. అప్పటికే టెస్టు జట్టు దిగ్గజాలతో నిండిపోవడం ఒక కారణమైతే.. వన్డేల్లోనూ కోహ్లి అంతగా నిరూపించుకోలేకపోవడం మరో కారణం. దీంతో విరాట్ 2011 లో వెస్టిండీస్ మీద కానీ అరంగేట్రం చేయలేకపోయాడు. ఆ ఏడాది జరిగిన టూర్ లో తొలి మ్యాచ్ ఆడిన కోహ్లి 4, 15 పరుగులే చేశాడు. మరో రెండేళ్ల వరకు సాధారణ ఆటగాడిగానే కొనసాగాడు. 2014 నుంచి అతడి టెస్టు కెరీర్ ఊపందుకుంది.
అయితే, ఆ ఏడాది ఇంగ్లండ్ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. నాడు తొలిసారి ఇంగ్లాండ్‌లో పర్యటించిన కోహ్లి.. అండర్సన్ బృందం స్వింగ్ బంతుల్ని ఎదుర్కోలేక పడిన అవస్థ అంతా ఇంతా కాదు. అయిదు టెస్టుల్లో కలిపి 10 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 13.4 సగటుతో 134 పరుగులు మాత్రమే చేశాడు. అప్పటిదాకా సచిన్ వారసుడు, నయా మాస్టర్ అన్నవాళ్లు ఈ పర్యటనలో అండర్సన్ అతడితో ఆటాడుకున్న తీరు చూసి తన టెక్నిక్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఆ తర్వాత వేరే దేశాల్లో ఎంత గొప్పగా ఆడినా.. 2014 ఇంగ్లాండ్ పర్యటన కెరీర్‌కు మచ్చలా ఉండిపోయింది. కానీ 2018లో ఆ దేశ పర్యటనకు వెళ్లి మొత్తం లెక్కలన్నీ సరి చేశాడు కింగ్. ఈసారి 5 టెస్టుల్లో కలిపి 10 ఇన్నింగ్స్‌ల్లో 59.3 సగటుతో ఏకంగా 593 పరుగులు చేశాడతను. అందులో 2 శతకాలు, 3 అర్ధశతకాలున్నాయి. ఇక 2018 పర్యటన తొలి ఇన్నింగ్స్‌లోనే 149 పరుగులతో అండర్సన్ బృందానికి కోహ్లి దీటైన జవాబిచ్చాడు.
ఆపై ఆస్ట్రేలియా పర్యటనలోనూ దుమ్మురేపాడు. ధోని తప్పుకోగా తాత్కాలిక సారథిగా వ్యవహరించిన టెస్టు రెండు ఇన్నింగ్స్ ల్లోనూ సెంచరీలు కొట్టి వహ్వా అనిపించాడు. ఆపై వెంటనే శాశ్వత సారథిగా నియమితుడయ్యాడు. ఆ సిరీస్ లో 4 టెస్టుల్లో 4 శతకాలు సహా 86.5 సగటుతో 692 పరుగులు చేశాడు.
మరుపురాని ఆ ఇన్నింగ్స్ల్ లు
2012లో అడిలైడ్ టెస్టు సందర్భంగా సచిన్ సహా ప్రధాన బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన స్థితిలో మేటి ఆస్ట్రేలియా పేస్ దళాన్ని ఎదుర్కొంటూ సాధించిన తొలి సెంచరీ (118).. 2013లో సచిన్ రిటైరయ్యాక తొలిసారి అతనాడే నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి స్టెయిన్ దళాన్ని సమర్థంగా ఎదుర్కొంటూ దక్షిణాఫ్రికాపై సాధించిన శతకం (119).. ఆ దేశంలో 2018లో సఫారీ పేసర్లు నిప్పులు చెరిగిన సెంచూరియన్ టెస్టుల్లో జట్టు మొత్తం కలిపి 307 పరుగులు చేస్తే అందులో సగం పరుగులతో తన స్థాయిని చాటిన 153 పరుగుల ఇన్నింగ్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే విరాట్ టెస్టు కెరీర్లో ఆణిముత్యాలు ఎన్నో! ''వంద '' లోటును తీర్చాలి కోహ్లి టెస్టు గణాంకాలు, వన్డే , టి20 విశిష్టతల గురించి చెప్పుకొంటూ పోతే ఎంతైనా చాలదు. కానీ, ఇప్పుడు అతడిని వెంటాడుతున్న లోటు సెంచరీ. 2019 నవంబరులో కోహ్లి చివరిసారిగా సెంచరీ చేశాడు.
ఆపై ఏ ఫార్మాట్లోనూ మూడంకెల స్కోరుకు చేరలేకపోయాడు. మధ్యలో కొవిడ్ కారణంగా సిరీస్ లు రద్దవడం రిథమ్ ను కొంత దెబ్బతీసినా.. ఏడాదిగా రెగ్యులర్ గానే టోర్నీలు జరుగుతున్నాయి. కానీ, కోహ్లి మాత్రం వందను అందుకోలేకపోతున్నాడు. ఏది ఏమైనా అతడి ఆటలో మునుపటంత తీవ్రత లేనిది వాస్తవం.
అందుకే ఎంతో అవసరమైన ఈ సందర్భంలో అది కూడా వందో టెస్టు ఆడుతూ సెంచరీ కొడితే చూడాలనేది కోహ్లి అభిమానుల ఆశ. చూద్దాం.. రేపటి మొహాలీ మ్యాచ్ లో శ్రీలంకపై దానిని అందుకుంటాడో లేదో? అన్నట్లు వందో టెస్టులో సెంచరీ కొట్టిన క్రికెటర్లు 9 మంది ఉన్నారు. వీరిలో భారతీయుడు ఎవరూ లేరు. రేపటి నుంచి మొదలయ్యే మ్యాచ్ లో కోహ్లి గనుక సెంచరీ కొడితే అది కచ్చితంగా అరుదైన ఘనత అవుతుంది.