Begin typing your search above and press return to search.
మైదానంలో అనుష్క.. ట్రోలింగ్ లో సోషల్ మీడియా
By: Tupaki Desk | 4 March 2022 3:30 PM GMTమన దేశంలో క్రికెట్ ఓ మతం.. సచిన్ లాంటి ఆటగాళ్లయితే దేవుళ్లతో సమానం. అందుకే వారికి అంతటి ఆరాధన. అభిమాన క్రికెటర్ ఏం చేసినా ప్రత్యేకమే. ఓ సచిన్, ఓ ధోని, ఇప్పటి తరంలో కోహ్లి.. ఇలా చెప్పుకొంటూ పోతే పాత తరంలో ఎందరో ఉన్నారు. వీరి ప్రతి కదలికా చర్చనీయాంశం అవుతుంది.
ఇక క్రీడా కెరీర్ లో అయితే వారేం చేసినా పరిశీలనకు గురవుతుంది. శుక్రవారం శ్రీలంకతో తొలి టెస్టుకు ముందు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఇలానే పరోక్షంగా చర్చనీయాంశమయ్యాడు. మొహాలీలో జరుగుతున్న ఈ టెస్టు కోహ్లీకి వందోది కావడం విశేషం. ఎందరో క్రికెటర్లు కలగనే ఈ మార్కను చేరుకున్న కోహ్లి ఆ సందర్భాన్ని కుటుంబంతో పంచుకోవాలని భావించాడు.
అందులో తప్పేమీలేదు. దీనికోసమే అన్నట్లు అతడి భార్య, సినీ నటి అనుష్క శర్మ మొహాలీ మైదానానికి వచ్చింది. ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. అదిరేటి డ్రెస్సులో అనుష్క భర్త కోహ్లి వందో టెస్టు వేదిక అయిన మొహాలీ మైదానానికి వచ్చిన అనుష్క సూపర్ డ్రస్సులో అదరగొట్టింది.
తెల్లటి ఫార్మల్ బ్లౌజ్ తో.. బీగీ రంగు ప్యాంటులో అదిరేటి డిజైన్ తో.. సింపుల్ లుక్ లోనే అదరగొట్టింది. జట్టు మైదానంలోకి దిగాక పెవిలియన్ లో కూర్చుని మ్యాచ్ ను ఆస్వాదించింది. అయితే, అంతకుముందు హెడ్ కోచ్, దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్.. కోహ్లికి క్యాప్ అందించాడు. దీంతో వందో టెస్టు మైలురాయి చేరుకున్న 71వ అంతర్జాతీయ ఆటగాడిగానే కాకుండా టీమ్‌ఇండియా తరఫున 12వ క్రికెటర్‌గా నిలిచాడు.
ఈ సందర్భంగా భారత జట్టు ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ అతడికి శుభాకాంక్షలు తెలుపుతూ 'ప్రత్యేకమైన జ్ఞాపికతో పాటు వందో టెస్టు క్యాప్' అందజేశాడు. ఈ వేడుకలో అనుష్క శర్మ కూడా పాల్గొన్నది. విరాట్ ఈ ఘనత సాధించడానికి నిజమైన అర్హుడని, అందుకోసం ఎంతో కష్టపడ్డాడని ద్రవిడ్ మెచ్చుకున్నాడు.
రాబోయే రోజుల్లో మరిన్ని శిఖరాలు అధిరోహించేందుకు ఈ వందో టెస్టు కోహ్లీకి కొత్త ఆరంభమని పేర్కొన్నాడు. 200 టెస్టులు ఆడాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అనంతరం కోహ్లీ మాట్లాడుతూ భావోద్వేగం చెందాడు. తన చిన్ననాటి హీరోల్లో ఒకరైన ద్రవిడ్ నుంచి వందో టెస్టు క్యాప్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నాడు.
ఈ సందర్భంగా టీమ్‌ఇండియా తరఫున ఆడేందుకు తనకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నానని తెలిపాడు. తన జీవితంలో ఇదో ప్రత్యేకమైన సందర్భం అని, ఈ వేడుకను చూడటానికి తన భార్య అనుష్కతో పాటు కుటుంబసభ్యులు వచ్చారన్నాడు. తాను వంద టెస్టులు ఆడటం పట్ల వారందరూ గర్వంగా ఉన్నారన్నాడు.
క్రికెట్ అనేది జట్టుగా ఆడే ఆటని, ద్రవిడ్ లాంటి గొప్ప వ్యక్తులు లేకపోతే తాను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదన్నాడు. అనుష్కకు ఏం పనంటూ..? మతి లేని ట్రోలింగ్ అంతా బాగానే ఉన్నా.. మైదానంలోకి కోహ్లితో పాటు అనుష్క శర్మ రావడాన్ని కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. గ్రౌండ్ లో ఆమెకు ఏం పనంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటివారు.. భర్త కోహ్లి వందో టెస్టు జ్హాపికను అందుకుంటున్నప్పడు అనుష్క ఎలా సంబరపడిందో గమనించినట్లులేరు. నిజానికి కోహ్లి ఘనతను తన ఘనతగా ఆమె భావించింది. అయితే, ఇక్కడ అభిమానులు రెండుగా చీలిపోయి ప్రశంసలు, విమర్శలకు దిగారు. ఇదేమైనా ఫ్యామిలీ ఈవెంటా? అంటూ ప్రశ్నలు సంధించారు.
అయితే, దీనికి ప్రతిగా కొందరు ప్రజంటేషన్ సందర్భంలో కోహ్లి ప్రసంగాన్ని సమాధానంగా చూపుతున్నారు. ''ఇదో ప్రత్యేక సందర్భం. నా భార్య ఇక్కడ ఉంది. ఆమె ఓ సోదరుడిలా వెన్నంటి నిలిచింది'' అని పేర్కొన్న సంగతిని ప్రస్తావిస్తున్నారు. ఇంకొందరైతే.. కోహ్లి కెరీర్ లో అనుష్క శర్మ పాత్ర గురించి పూర్తిగా చెప్పుకొస్తున్నారు.
విరాట్ కెరీర్ ప్రారంభంలో చేసిన షాంపూ యాడ్ వీరిద్దరినీ కలిపింది. అప్పటికి అనుష్క కూడా పెద్ద స్టార్ ఏమీ కాదు. తర్వాతి నుంచి బంధం బలపడుతూ వచ్చింది. మరోవైపు ఏ దశలోనైనా తనకు సాయం చేసినవారిని విస్మరించని తత్వం విరాట్ ది. అందుకే నాటి బంధాన్ని మూడు ముళ్లతో ముడివేశాడు.