Begin typing your search above and press return to search.
డీఆర్ఎస్ దుమారం.. థర్డ్ ఎంపైర్ పై విరాట్ కోహ్లీ ఆగ్రహం
By: Tupaki Desk | 14 Jan 2022 10:39 AM GMTసౌతాఫ్రికా-ఇండియా 3వ టెస్టు మ్యాచ్ లో డీఆర్ఎస్ పై దుమారం రేగింది. అశ్విన్ బౌలింగ్ లో ఎల్గర్ సమీక్షలో నాటౌట్ గా తేలడం వివాదాస్పదమైంది. సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 21వ ఓవర్లో ఎల్గర్ ఎల్బీ కోసం జట్టు అప్పీల్ చేసింది. మైదానంలో ఎంపై ఎరాస్మస్ ఔటిచ్చాడు. కానీ ఎల్గర్ సమీక్ష కోరాడు.
దీంతో థర్డ్ ఎంపైర్ బంతి గమనాన్ని చూసి ఔట్ అనుకొని ఎల్గర్ కూడా ఔట్ అనుకొని వెళ్లబోయాడు. కానీ చివరకు బంతి వికెట్ల మీద నుంచి వెళుతున్నట్టు తేలింది. అతడు తిరిగివచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు.
ఇక స్టంప్స్ పై నుంచి బంతి వెళుతుందని సమీక్షలో తేలడంతో కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు. అది కీలక వికెట్ కావడంతో దక్షిణాఫ్రికా ప్రసారదారును ఉద్దేశించి స్టంప్ మైక్ దగ్గరకు వెళ్లి వ్యాఖ్యలు చేశారు. 'బంతికి మెరుగు పెడుతున్నప్పుడు కేవలం ప్రత్యర్థిపైనే కాదు.. మీ జట్టుపైనా దృష్టి పెట్టాలి. ఎప్పుడూ ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకోవాలని చూస్తారు' అని కోహ్లీ ఫైర్ అయ్యారు. 'పదకొండు మందికి వ్యతిరేకంగా మొత్తం దేశం ఉంది' అని కేఎల్ రాహుల్ అనడం వినిపించింది.
'సూపర్ స్పోర్ట్స్ మీరు గెలవాలంటే మెరుగైన మార్గాన్ని ఎంచుకోండి' అని అశ్విన్ సైతం విమర్శించాడు. ఎంపైర్ ఎరాస్మస్ కూడా మైదానంలోని భారీ తెరపై రిప్లై చూస్తూ.. 'అది అసాధ్యం' అన్నాడు.దీంతో ఈ వివాదం పెద్దది అయ్యింది.

ఆట ముగిశాక ఈ డీఆర్ఎస్ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. 'దీన్ని మీరు చూశారు.. మేమూ చూశాం.. ఈ విషయాన్ని మ్యాచ్ రిఫరీకే వదిలేస్తున్నా.. దీనిపై నేనేమీ మాట్లాడనని' భారత్ బౌలింగ్ కోచ్ పారస్ అన్నాడు.