Begin typing your search above and press return to search.
కోహ్లి ప్లేటు ఫిరాయించేశాడే..
By: Tupaki Desk | 2 Jun 2021 2:30 PM GMTభారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే ముందు ముంబయిలో క్వారంటైన్లో ఉన్న అతను.. ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలే అందుక్కారణం. మీ ఆహారపు అలవాట్లేంటి అని ఓ అభిమాని అడగ్గా.. ''ఎక్కువగా కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని గుడ్లు, రెండు కప్పుల కాఫీ, పప్పు, క్వినోవా, అధిక మొత్తంలో పాలకూర తింటా. దోసెలన్నా ఇష్టమే. చాలా వరకు ఏవైనా సరే.. పరిమితంగానే తింటా'' అన్నాడు. ఐతే ఇంతకుముందు తాను 'వెగాన్'గా మారినట్లు చెప్పిన కోహ్లి.. గుడ్లు తినడమేంటి, కాఫీలు తాగడమేంటి అని అభిమానులకు సందేహం కలిగింది. వెగాన్ అంటే మాసం మాత్రమే కాదు.. జంతువుల నుంచి వచ్చే ఏ ఉత్పత్తినీ తీసుకోరు. అంటే కోడి పెట్టే గుడ్డు, ఆవు ఇచ్చే పాల ఉత్పత్తులు కూడా ముట్టుకోరు. కోహ్లి 'వెగాన్'గా మారినట్లు కొన్నేళ్ల కిందట మీడియాలోె ప్రముఖంగా వార్తలొచ్చాయి. అతడి స్ఫూర్తితో వెగాన్ బాట పట్టిన వాళ్లూ ఉన్నారు. అలాంటిది ఇప్పుడు కోహ్లి గుడ్లు, కాఫీ తీసుకుంటున్నట్లు చెప్పేసరికి అంతా షాకైపోయారు. చాలామంది ప్రశ్నలు సంధిస్తుండటంతో ఈ విషయమై కోహ్లి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.
తాను వెగాన్‌గా మారానని తాను చెప్పానా అని అతను ప్రశ్నించడం విశేషం. తాను వెజిటేరియన్ అని మాత్రమే చెప్పానని.. వెగాన్ కాదని.. కాబట్టి అందరూ ఎవరు తినాలనుకున్నది వాళ్లు తినాలని అన్నాడు కోహ్లి. ఐతే కోహ్లి, వెగాన్ అనే పదాలను గూగుల్లో కొడితే కొన్నేళ్ల ముందు అతను వెగాన్‌గా మారాడంటూ ప్రముఖ మీడియా సంస్థలన్నింట్లోనూ వార్తలు కనిపిస్తాయి. మరి మధ్యలో ఎందుకు కోహ్లి నిర్ణయం మార్చుకుని, ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకున్నాడో? బహుశా గుడ్లు తినకుండా ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అంత తేలిక కాదనుకున్నాడేమో.