Begin typing your search above and press return to search.
కొహ్లీ పిసినారితనం గురించి యూవీ కామెంట్!
By: Tupaki Desk | 12 Sep 2016 1:10 PM GMTటీం ఇండియా క్రికెట్ లో వరుసపెట్టి సెంచరీలు చేసి - బయట ప్రపంచంలో అనుష్క శర్మతో ప్రేమాయణం సాగించి ఫుల్ గా వార్తల్లో నిలిచాడు విరాట్ కొహ్లీ. మైదానంలో సెంచరీలు చేసి బ్యాట్ ఎత్తడంలోనూ - స్టాండ్స్ లో కూర్చున్న గర్ల్ ఫ్రెండ్ కి ఫ్లైయ్యింగ్ కిస్ లు ఇవ్వడంలోనూ మనోడు బహు నేర్పరి. ఇవి ఇప్పటివరకూ బయట ప్రపంచానికి తెలిసిన విషయాలు. అయితే ఇవే కాదు విరాట్ కొహ్లీలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.. వాటిలో పిసినారితనం కూడా ఒకటి అని వరుసపెట్టి చెప్పాడు యువరాజ్ సింగ్.
ఒక రేడియో ప్రోగ్రాం లో సరదాగా ముచ్చటించిన యూవీ.. తన జట్టు సభ్యులకు సంబందించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు అభిమానులతో పంచుకున్నాడు. ఈ సందర్భంగా కొహ్లీ ప్రస్థావన రాగానే.. అతను ఒక పెద్ద పిసినారని చెప్పాడు యువరాజ్ సింగ్. ప్రస్తుత టీం ఇండియా జట్టులోనే కోహ్లీ అత్యంత పిసినారని యువరాజ్ వ్యాఖ్యానించాడు. కోహ్లీ తర్వాత - ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా కూడా మా గొప్ప పిసినారని చెప్పుకొచ్చాడు యూవీ. తామంతా కలిసి బయటకు వెళ్లినప్పుడు కోహ్లీ తన జేబులో నుంచి అస్సలు డబ్బులు తీయడని - కొహ్లీతో డబ్బులు బయటకు తీయించడానికి తాను చాలా కష్టపడాల్సి వచ్చేదని చెప్పాడు యూవీ.
ఇక నెహ్రా విషయానికి వస్తే... తనకు భర్యా - పిల్లలు ఉన్నారని అందుకే తాను ఎక్కువగా ఖర్చు పెట్టలేనని నెహ్రా తనతో చెప్పాడని యూవీ గుర్తు చేసుకున్నాడు. అలా అని కేవలం కోహ్లీ - నెహ్రాలే కాదు టీం ఇండియాలో తనకంటే సీనియర్లైన పలువురు ఆటగాళ్లలో కూడా చాలామంది పిసినార్లు ఉన్నారని.. కాకపోతే ఇప్పుడు వాళ్ల పేర్లు చెప్పనని యూవీ అన్నాడు. సచిన్ - గంగూలి - ద్రవిడ్ లలో మీరు చెప్పిన సీనియర్స్ ఎవరైనా ఉన్నారా అని యాంకర్ అడగగా.. దయచేసి ఇక ఆ టాపిక్ వదిలేయాలని కోరాడు. ఏది ఏమైనా.. యూవీ గొప్ప ఆసక్తికరమైన విషయాలే చెప్పాడు!!