Begin typing your search above and press return to search.
కొత్త హెయిర్ స్టైల్లో కింగ్ కోహ్లీ.. వైరల్ ఫొటోలు
By: Tupaki Desk | 18 Sep 2022 11:30 AM GMTకెరీర్‌లో కష్టాల్లో కూరుకుపోయిన విరాట్ కోహ్లీ తాజాగా ముగిసిన ఆసియాకప్‌లో సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కోహ్లీ కొత్త లుక్‌తో ఈ నెల 20వ తేదీ నుంచి ఆస్ట్రేలియాతో జరగబోయే 3 టీ20ల సిరీస్ లో పాల్గొనబోతున్నాడు. కొత్త హెయిర్ స్టైల్ తో కొత్త ఛాలెంజ్‌కి సిద్ధమవుతున్నాడు. ఆదివారం మొహాలీలో టీమిండియా జట్టు దిగింది. ఈ సందర్భంగా 33 ఏళ్ల విరాట్ కోహ్లీ కొత్త హ్యారీకట్ హెయిర్ స్టైల్ తో కనువిందు చేశాడు.
శనివారం హెయిర్‌స్టైలిస్ట్ రషీద్ సల్మానీ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో విరాట్ కోహ్లీకి కొత్త హెయిర్ స్టైల్ చేసిన వీడియోను పోస్ట్ చేశాడు. కోహ్లి కొత్త హెయిర్‌స్టైల్ కొన్ని ఫోటోలను సల్మానీ షేర్ చేశాడు. దానిపై అతను "కింగ్ కోహ్లీ కోసం కొత్త లుక్" అని రాశాడు. కొత్త లుక్‌లో పెద్దగా కనిపించనప్పటికీ ఈ పోస్ట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది.
ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్‌లో తన తొలి టీ20 శతకం సాధించడం ద్వారా బ్యాటర్ గా చివరకు ఫాంలోకి వచ్చాడు కోహ్లీ. మూడేళ్ల తర్వాత తన సెంచరీ కరువును తీర్చుకున్నాడు. కోహ్లీ అందుకే మంచి లుక్ తో తాజా సిరీస్ లో పాల్గొంటున్నాడు. కోహ్లి 5 మ్యాచ్‌ల్లో 276 పరుగులు చేయడం ద్వారా టోర్నమెంట్ లో భారత అత్యధిక స్కోరర్‌గా ముగించాడు.
ఆస్ట్రేలియా T20 సిరీస్ కు ప్రపంచకప్ లో పాల్గొనే జట్టునే ప్రకటించారు.
భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, ఆర్.అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, అక్షర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా మరియు ఉమేష్ యాదవ్.