Begin typing your search above and press return to search.
కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించడమే చాలా ఎక్కువ
By: Tupaki Desk | 19 March 2019 12:00 PM GMTమరి కొన్ని రోజుల్లో ఐపీఎల్ ఆరంభం కాబోతున్న నేపథ్యంలో జట్ల కూర్పు విషయంలో ప్రాంచైజీలు మరియు కెప్టెన్ లు తలమునకలై ఉన్నారు. ఈ సమయంలో అందరి దృష్టి కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఉంది. ఎందుకంటే ఆ జట్టుకు కోహ్లీ సారధ్యం వహిస్తున్నా కూడా ఇప్పటి వరకు ఒక్కటి అంటే ఒక్కసారి కూడా ఐపీఎల్ కప్పును ముద్దాడలేక పోయారు. చూడటానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చాలా బలంగా కనిపించినా కూడా ఎందుకు కప్పు సాధించలేక పోతుంది అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న. ఇక కొందరు కోహ్లీ కెప్టెన్సీపై కూడా ప్రశ్నిస్తున్నారు.
తాజాగా టీం ఇండియా సీనియర్ ఆటగాడు గంభీర్ ఈ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ తెలివైన కెప్టెన్ అని తాను భావించడం లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా బెంగళూరు ఒక్క ఐపీఎల్ ట్రోఫీని కూడా దక్కించుకోలేక పోయింది. అందుకు ప్రధాన కారణం కోహ్లీ తీసుకున్న తప్పుడు నిర్ణయాలే అని తాను భావిస్తాను. అలాంటి కోహ్లీని కెప్టెన్ గా కొనసాగించడమే చాలా ఎక్కువ. అలాంటిది అతడిని ధోని - రోహిత్ శర్మ వంటి వారితో పోల్చడం ఏంటీ అన్నాడు.
ధోని మరియు రోహిత్ శర్మలు కెప్టెన్ లుగా మూడు సార్లు ఐపీఎల్ ను సాధించారు. వారితో కోహ్లీకి పోలిక వద్దే వద్దు అంటూ గంభీర్ అన్నాడు. గంభీర్ వ్యాఖ్యలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. టీం ఇండియా కెప్టెన్ అయిన కోహ్లీపై మరీ ఈస్థాయిలో విమర్శలు చేయడం ఏంటీ అంటూ కొందరు గంభీర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. గంభీర్ వ్యాఖ్యలపై కోహ్లీ ఎలా రియాక్ట్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది.