Begin typing your search above and press return to search.
టీ20 కెప్టెన్సీపై విరాట్ కోహ్లీ కీలక నిర్ణయం
By: Tupaki Desk | 16 Sep 2021 1:25 PM GMTటీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీ20 జట్టు కెప్టెన్ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. టీ20 ప్రపంచకప్ తర్వాత ఈ ఫార్మాట్ నుంచి వైదొలుగనున్నట్లు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఒక ప్రకటన విడుదల చేశాడు.
'ఐదారేళ్లుగా మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఉన్నా.. 8-9 ఏళ్లుగా మూడు ఫార్మాట్లలో ఆడుతున్నా.. గంగూలీ, రవిశాస్త్రి, రోహిత్ శర్మతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చా.. పని ఒత్తిడి వల్లే ఈ నిర్ణయం తీసుకున్నా' అని ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లీ సంచలన ప్రకటన చేశాడు.
ఇక టెస్టు, వన్డే జట్లకు కోహ్లీ కెప్టెన్ గా కొనసాగనున్నాడు. టీ20 జట్టులో బ్యాట్స్ మెన్ గా కొనసాగుతానని కోహ్లీ స్పష్టం చేశాడు.
ఇక కోహ్లీ వైదొలిగిన తర్వాత టీ20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశం ఉందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.