Begin typing your search above and press return to search.
ఇన్ స్టాలో కోహ్లీ చేసే ఒక్క పోస్టుకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసా?
By: Tupaki Desk | 2 July 2021 11:04 AM GMTసామాన్యులకు టైం పాస్.. సెలబ్రిటీలకు అదో అద్భుతమైన ఆదాయ వనరు. విన్నంతనే ఏ మాత్రం నమ్మబుద్ధి కాని నిజమిది. సోషల్ మీడియా అన్నంతనే.. గంటల తరబడి చూసే కోట్లాది మందికి అయితే డేటా ఖర్చు.. టైం దండుగ. అయితే.. వచ్చేదేమీ లేదా అంటే కూసింత మానసిక ఆనందం. ఇది మినహా ఆదాయం అంటూ ఏమీ ఉండదు. అదే సెలబ్రిటీల వ్యవహారమే వేరు.
వారు కానీ.. ఇన్ స్టాలో ఒక పోస్టు పెడితే వారికి వచ్చే ఆదాయం వింటే ఏ మాత్రం నమ్మబుద్ధి కాదు. ఆ మాటకు వస్తే.. సదరు పోస్టును వారి స్వహాస్తాలతో కూడా పెట్టరు. వారి అకౌంట్లను డీల్ చేయటానికి పెద్ద టీం ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు సోషల్ మీడియా అన్నది ఒక వ్యాపారమని చెప్పక తప్పదు. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టు చేసే పోస్టులకు కోట్లాది రూపాయిల ఆదాయం వస్తుంటుంది. యాడ్స్.. బిజినెస్.. ప్రమోషన్లు ఇలా పలు కార్యక్రమాలు చేపట్టటం ద్వారా వారంతా కోట్లు వెనకేసుకుంటూ వస్తారు. ఇన్ స్టాలో పోస్టుల ద్వారా సెలబ్రిటీలు ఎంతేసి సంపాదిస్తారన్న విషయంపై తాజాగా హాపర్ హెచ్ క్యూ జాబితాను విడుదల చేసింది.
2021లో ఇన్ స్టా సంపన్ననుల జాబితా.. వారు సంపాదించే మొత్తం విస్మయానికి గురి చేయకమానదు. పుట్ బాల్ దిగ్గజం క్రిస్టియానో రోనాల్డో ఇన్ స్టా సంపన్నుల జాబితాలో తొలి స్థానంలో నిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక ఫాలోవర్లు ఉన్న ఈ పోర్చుగల్ ఆటగాడు ఒక్కో ప్రమోషనల్ పోస్టుకు ఛార్జ్ చేసేది ఎంతో తెలుసా? మన రూపాయిల్లో చెప్పాలంటే అక్షరాల రూ.11.9 కోట్లు. గత ఏడాది మొదటి స్థానంలో ఉన్నడబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో నిలుస్తారు. అతనికి భారీగా ముట్టజెబుతారు.
మన వాళ్ల విషయానికి వస్తే..టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 19వ స్థానంలో నిలుస్తారు. దేశంలో అత్యధిక మంది ఇన్ స్టా ఫాలోవర్లు ఉన్న విరాట్ ఒక పోస్టుకు రూ.5.08 కోట్లు తీసుకుంటారు. అంటే.. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఐదారు సినిమాలకు ఛార్జి చేసే మొత్తం కోహ్లీ ఒక్క ప్రమోషనల్ పోస్టు పెడితే వచ్చేస్తుందట. తర్వాతి స్థానంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 27వ స్థానంలో నిలిచింది. ఆమె ఇన్ స్టాలో చేసే ఒక్కో పోస్టుకు రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తారని చెబుతున్నారు. గత ఏడాది ఆమె 19వ స్థానంలో నిలిచారు. మొత్తం 395 మంది సెలబ్రిటీల్లో భారత్ నుంచి చోటు దక్కించుకున్న సెలబ్రిటీలు వీరిద్దరే కావటం గమనార్హం.