Begin typing your search above and press return to search.

ఫోర్బ్ లో భాయ్ ని వెనక్కు నెట్టిన కోహ్లీ

By:  Tupaki Desk   |   19 Dec 2019 11:49 AM GMT
ఫోర్బ్ లో భాయ్ ని వెనక్కు నెట్టిన కోహ్లీ
X
బాలీవుడ్ లో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించే భాయ్ సల్మాన్ ఖాన్ వెనకడుగు వేయాల్సి వచ్చింది. క్రికెట్ గ్రౌండ్ లో బ్యాట్ తో చెలరేగిపోయే విరాట్ కోహ్లీ తాజాగా ఫోర్బ్ విడుదల చేసిన సెలబ్రిటీల జాబితాలో తన సత్తా చాటారు. ఇప్పటిదాకా ఈ విభాగంలో సల్మాన్ అధిక్యతను గండి కొట్టాడు.

గత ఏడాది తొలి స్థానంలో నిలిచిన సల్మాన్ ను తాజాగా వెనక్కు నెట్టేసి ఆ స్థానాన్ని ఆక్రమించాడు కోహ్లీ. ఈ ఏడాది సెలబ్రిటీల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. ఇందులో కోహ్లీ మొదటిస్థానంలో నిలవగా.. అనూహ్యంగా సల్మాన్ ఖాన్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

ఆసక్తికరమైన విషయం ఏమంటే.. బాలీవుడ్ యాక్షన్ కింగ్ అక్షయ్ కుమార్ ఈ జాబితాలో రెండోస్థానాన్ని చేజిక్కించుకోవటం వివేషం. గత ఏడాది రెండో స్థానంలో నిలిచిన కోహ్లీ ఈసారి టాప్ కు చేరితే.. సల్మాన్ మూడో స్థానానికి పడిపోయారు. ఇక.. మిస్టర్ కూల్ ధోనీ ఐదో స్థానంలో నిలువగా.. క్రికెట్ దేవుడుగా అభిమానులు కీర్తించే సచిన్ టెండూల్కర్ తొమ్మిదో స్థానంలో నిలిచారు.