Begin typing your search above and press return to search.
సెహ్వాగ్ పై పెద్ద నోట్ల రద్దు ప్రభావం
By: Tupaki Desk | 30 Nov 2016 10:47 AM GMTపెద్ద నోట్ల రద్దు ప్రభావానికి గురవని వారు ఎవరంటే వేళ్లపైనే లెక్కించాలి. ఎంతో కొంత స్థాయిలో ప్రతి ఒక్కరూ ఈ ప్రభావానికి లోనయ్యారు. టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ సెహ్వాగ్ కూడా నోట్ల రద్దుతో కష్టాలు పడుతున్నారట. ముఖ్యంగా మోడీ గవర్నమెంటు తెచ్చిన రూ.2 వేల నోటుకు చిల్లర దొరక్క ఆయన ఇబ్బంది పడుతున్నారట. దీంతో ఆయన ఒకప్పటి తన సహచర క్రికెటర్ రవీంద్ర జడేజాను కాస్త అమౌంట్ ట్రాన్స్ ఫర్ చేయి జడేజా భాయ్ అంటూ ట్విట్టర్లో సరదాగా కామెంట్ పెట్టారు.
నిత్యం ట్విట్టర్ లో ఏదో ఒక అంశంపై తనదైన శైలిలో కామెంట్లు చేసే సెహ్వాగ్ ఈసారి నోట్ల రద్దు ప్రభావంపై మాటలు విసిరారు. జడేజాను ఉద్దేశించి సెహ్వాగ్ సరదాగా ఓ ట్వీట్ చేశాడు. 'క్యా జడ్డూ భాయ్... 2000 నోట్లకు చిల్లర దొరక్క మేము బాధ పడుతుంటే... నీవు మాత్రం ఏకంగా లక్ష రూపాయలను పేటీఎం అకౌంట్ లో వేసుకున్నావ్. అందులో నుంచి కొంచెం నాకు ట్రాన్స్ ఫర్ చేయొచ్చుగా' అంటూ సరదాగా ట్వీట్ చేశాడు.
ఇంతకీ జడేజా పేటీఎం ఖాతాలో లక్ష రూపాయలు వేసుకున్న విషయం సెహ్వాగ్ కు ఎలా తెలిసింది అనుకుంటున్నారా.. ఏం లేదండీ. మొహాలీలో ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్టులో బ్యాట్, బాల్ రెండింటితో రాణించిన జడేజా... ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు కింద లక్ష రూపాయల పేటీఎం క్యాష్ ప్రైజ్ దక్కించుకున్నారు. దీంతో సెహ్వాగ్ రవీంద్ర జడేజాను సరదాగా ఇలా అభినందించాడన్నమాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/