Begin typing your search above and press return to search.
క్రికెట్ కు పింక్ ని జోడించి చెప్పిన సెహ్వాగ్!
By: Tupaki Desk | 16 Sep 2016 12:57 PM GMTఅమ్మాయిల అన్ని వైపుల నుంచీ ఎన్నో కండిషన్స్ ఉంటాయి. తమకు నచ్చినట్లు వారి బ్రతికితే.. ఆష్కేపిస్తారు, అలా కాదంటే బరి తెగింపు ముద్ర వేస్తారు. అమ్మాయిలకు మాత్రం తమకు నచ్చినట్టు చేసే హక్కు లేదా? వారికి నో చెప్పే హక్కు లేదా? అనే ఆవేదన నుంచి పుట్టిన సినిమా "పింక్". అమితాబ్ బచ్చన్ - తాప్సీ ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని శూజిత్ సర్కార్ నిర్మించగా, అనిరుద్ధరాయ్ చౌధురి దర్శకత్వం వహించారు. శుక్రవారం విడుదలయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుందనే చెప్పాలి. ఈ క్రమంలో సెహ్వాగ్ ఈ సినిమాను అమితాబ్ తో కలిసి వీక్షించి.. తన అనుభవాలను పంచుకున్నాడు.
"పింక్" ప్రీమియర్ షో ని టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. అమితాబ్ బచ్చన్ తో కలిసి వీక్షించి తన అనుభవాలను షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా స్పందించిన సెహ్వాగ్... " అమితాబ్ తో కలిసి ఈ సినిమా చూడటం ఎంతో సంతోషం.. ఈ సినిమా అద్భుతమైన సందేశాన్నిచ్చింది.. మహిళలను గౌరవించండం - స్నేహంతో వారు చూపించే చనువును అన్నింటికీ అనుకూలంగా భావించొద్దనే సందేశం ఇవ్వడమే కాకుండా.. ఒక్కోసారి "నో" అని చెబితే వారిని పదేపదే బతిమిలాడుతూ ఒప్పించే ప్రయత్నం చేయవద్దనే అంశం ఎంతో బాగుంది, ప్రత్యేకంగా ఆ అంశానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను" అని చెప్పారు.
ఇదే సమయంలో పింక్ సినిమాలో ఉన్న సోల్ అంశాన్ని - క్రికెట్ కు తన వ్యక్తిగత జీవితానికి ముడిపెట్టి చెప్పిన సెహ్వాగ్... చాలాసార్లు తాను ఇంటర్వ్యూలకు నో చెప్పినప్పుడు కూడా వారంతా అదే పనిగా అడగడం - వేర్వేరు పద్ధతుల్లో ఒప్పించేందుకు ప్రయత్నించడం చేసేవారు... క్రికెట్ మైదానంలో బ్యాట్స్ మన్ పరుగు తీస్తుండగా రెండో పరుగుకు ప్రయత్నించినప్పుడు అవతలి బ్యాట్స్ మెన్ "నో" చెప్పినప్పుడు వారిని గౌరవించడం ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే... అలా అవతలి వ్యక్తి మాట వినకుండా పరుగెడితే రనౌట్ కావడం ఖాయం.. అది రియల్ లైఫ్ అయినా కూడా అంతే" అని వీరేంద్రుడు తన అనుభవాలను తనదైన శైలిలో చెప్పాడు.