Begin typing your search above and press return to search.

ఆసీస్ ఆట‌గాళ్ల‌పై సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   4 Oct 2017 9:57 AM GMT
ఆసీస్ ఆట‌గాళ్ల‌పై సెహ్వాగ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
క్రికెట‌ర్ గా దూకుడు ఆడే అల‌వాటున్న వీరేంద్ర సెహ్వాగ్‌.. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో అత‌గాడి హాస్య చ‌తుర‌త‌.. వ్యంగ్యం కార‌ణంగా అంద‌రి దృష్టిని అదే ప‌నిగా ఆక‌ర్షిస్తున్నార‌ని చెప్పాలి. విష‌యం ఏదైనా.. త‌న‌దైన శైలిలో రియాక్ట్ కావ‌టం సెహ్వాగ్‌కు ఒక అల‌వాటు. సూటిగా.. సుత్తి లేకుండా ముఖం ప‌గిలిపోయేలా సెహ్వాగ్ ట్వీట్లు ఉంటాయ‌ని చెప్పాలి.

తాజాగా ఆసీస్ క్రికెట‌ర్ల‌పై ఈ మాజీ ఓపెన‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆసీస్ క్రికెట‌ర్లు అన్న వెంట‌నే మైదానంలో వారు చేసే ప‌నులు గుర్తుకు వ‌స్తుంటాయి. ప్ర‌త్య‌ర్థుల్ని త‌మ మాట‌ల‌తో.. చేత‌ల‌తో ఇబ్బంది పెట్ట‌టంలో వారి త‌ర్వాతే ఎవ‌రైనా. స్లెడ్జింగ్‌కు కేరాఫ్ అడ్ర‌స్ అయిన ఆసీస్ క్రికెట‌ర్లు తాజాగా భార‌త ప‌ర్య‌ట‌న‌లో త‌మ తీరుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు.

మైదానంలో ఆసీస్ ఆట‌గాళ్ల తీరులో మార్పు రావ‌టానికి అస‌లు కార‌ణం వేరేగా సెహ్వాగ్ అభివ‌ర్ణించారు. ఆసీస్ ఆట‌గాళ్లు స్లెడ్జింగ్ జోలికి వెళ్ల‌టం లేద‌ని.. మాట‌ల యుద్ధానికి దిగ‌టం లేద‌ని.. ఇదంతా ఐపీఎల్ పుణ్య‌మేన‌ని చెప్పారు.మైదానంలో ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రించిన ప‌క్షంలో అలాంటి ఆట‌గాళ్ల‌ను ఐపీఎల్ ఫ్రాంచైజీలు తీసుకునే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటాయ‌ని.. అదే జ‌రిగితే ఆసిస్ క్రికెట‌ర్ల‌కుఆర్థికంగా తీవ్ర న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉంది. ఈ కార‌ణంతోనే వారు మైదానంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని.. మౌనంగా ఉంటున్న‌ట్లుగా వ్యాఖ్యానించారు.

త‌మ తీరు స‌రిగా లేకుండా వ‌చ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో ఫ్రాంచైజీలు త‌మ‌ను దూరంగా పెట్టే అవ‌కాశం ఉంద‌న్న భ‌యంతోనే ఆసీస్ ఆట‌గాళ్లు జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లుగా తెలిపారు.

బెంగ‌ళూరులో జ‌రిగిన రెండో టెస్ట్ లో స్టీవ్ స్మిత్ డీఆర్ ఎస్ కోసం డ్రెస్సింగ్ రూమ్ వైపు చూడ‌టం పెను దుమారాన్నే రేపింది. బ్రేన్ ఫీడింగ్ కార‌ణంగానే తాను అలా చేసిన‌ట్లుగా వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఆసీస్ జ‌ట్టు బ‌లాన్ని విశ్లేషిస్తూ.. టెస్టు సిరీస్ తాలుకూ ఓట‌మి ఒత్తిడి ఆసీస్ జ‌ట్టు స‌భ్యుల మీద‌ ఉంద‌ని సెహ్వాగ్ విశ్లేషించాడు.