Begin typing your search above and press return to search.
సోషల్ మీడియాలో సెహ్వాగ్ సిక్సర్!
By: Tupaki Desk | 13 Nov 2017 9:56 AM GMTసందర్భమేదైనా ఆలోచింపచేసేలా ట్వీట్ చేసే వ్యక్తుల్లో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ముందుంటాడు. వర్తమాన వ్యవహారాలపై తనదైన శైలిలో ట్వీటుతూ వేడి పుట్టించే ఈ ఢిల్లీ డైనమేట్‌ను ట్విట్టర్ కింగ్ అని ముద్దుగా పిలుస్తుంటారు. క్రికెట్‌కు గుడ్ బై చెప్పేశాక సోషల్‌మీడియా వేదికగా వీరేంద్రుడు పలు అంశాలపై సిక్సర్‌లు బాదుతున్నాడు. ఈ క్రమంలో సెహ్వాగ్ ఓ ఆసక్తికరమై ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
సంస్కృతిని మించినది ఏదీ లేదంటూ ఇన్ స్టాగ్రామ్ లో సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ప్రపంచం ఫ్యాషన్ దిశగా దూసుకుపోతూ.. రోజుకో కొత్త మోడల్ పుట్టుకొస్తోంది. అయితే మనిషి నాగరికత ఎక్కడ మొదలైందో ప్రతిబింబించే ఓ ఉదంతానికి సంబంధించిన ఫొటోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడమే కాకుండా కామెంట్ సైతం జత చేశాడీ మాజీ క్రికెటర్. ప్రపంచంలోనే ఎంతో గుర్తింపు పొందిన వేదికపై పూర్తి గిరిజన సంప్రదాయ దుస్తుల్లో హాజరయిన వ్యక్తి ఫోటోను పోస్ట్ చేసి.. సంస్కృతిని మించిది ఏదీ లేదు అంటూ ఓ కామెంట్ పెట్టారు.
పశ్చిమాఫ్రికాలోని రిపబ్లిక్ ఆఫ్ గునియాకు చెందిన ఓ ప్రతినిధి సాంప్రదాయ వస్త్రధారణలో అంతర్జాతీయ సమావేశంలో పాల్గొన్న ఫొటోను ఈ సందర్భంగా సెహ్వాగ్ పోస్ట్ చేశాడు. ఆ వ్యక్తి గిరిజన సంప్రదాయం ఉట్టిపడేలా ఆ ఫొటోలో ఉన్నారు. ఫ్యాషన్ మాయలో పడి యువత మన సంప్రదాయ వేషధారణ మరచిపోతున్న తరుణంలో సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ వారికి గుణపాఠం చెప్పేలా ఉందని పలువురు సంప్రదాయవాదులు భావిస్తున్నారు.