Begin typing your search above and press return to search.
పశ్చిమ బెంగాల్ సీఎంగా సౌరబ్ గంగూలీ?
By: Tupaki Desk | 29 Oct 2019 8:29 AM GMTబీసీసీఐ చీఫ్ పదవి చేపట్టిన టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ భవిష్యత్తులో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రవుతారని టీమిండియా ఒకప్పటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ జోష్యం చెప్పారు. గంగూలీ బీసీసీఐ చీఫ్ అవుతాడని తాను ఏనాడో ఊహించి చెప్పానని - అది నేడు నిజమైందని వీరేంద్ర సెహ్వాగ్ చెప్పాడు. తాను చెప్పిందే నిజమైందని.. ఆయన భవిష్యత్తులో వెస్ట్ బెంగాల్ సీఎం అవుతారని ఇప్పుడు చెబుతున్నానని.. అది జరిగి తీరుతుందని ఆయన అన్నారు.
2007లో కేప్ టౌన్ లో జరుగుతున్న టెస్టులో తాను - వసీంజాఫర్ త్వరగా అవుటయ్యామని - టెండూల్కర్ బ్యాటింగ్ కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో గంగూలీ బ్యాటింగ్ కు దిగినట్టు సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్ లో దాదా అద్భుతంగా ఆడాడని పేర్కొన్నాడు. డ్రెస్సింగ్ రూములో మాటల మధ్యలో మనలో ఎవరికైనా బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికయ్యే అర్హత ఉందంటే అది ఒక్క గంగూలీకేనని చెప్పానని, తన మాటలను అందరూ అంగీకరించారని పేర్కొన్నాడు. ఇప్పుడు ఆ మాట నిజమైందన్నారు. అలాగే, గంగూలీ ఏనాటికైనా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి అవుతాడని సెహ్వాగ్ పేర్కొన్నాడు. తన మాట తప్పదని - జరిగి తీరుతుందని తేల్చి చెప్పాడు.
కాగా బెంగాల్ రాజకీయ పరిస్థితులు కూడా అందుకు అవకాశముందని సూచిస్తున్నారు. మరో టీమిండియా క్రికెటర్ గౌతం గంభీర్ ఇప్పుడు బీజేపీ తరఫున ఈస్ట్ దిల్లీ ఎంపీగా ఉన్నారు. త్వరలో జరగబోయే దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే ఆయనే సీఎం అవుతారన్న అంచనాలున్నాయి. అదేవిధంగా బెంగాల్ లో దాదాను ముందు పెట్టి దీదీని ఎదుర్కోవాలని బీజేపీ మనుసులో ఉన్నట్లుగా ప్రచారం ఉంది. మరి... సెహ్వాగ్ జోష్యం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.