Begin typing your search above and press return to search.
కరోనా దెబ్బ : దివాలా ప్రక్రియకు అమెరికా కోర్టులో వర్జిన్ అట్లాంటిక్ పిటిషన్ !
By: Tupaki Desk | 6 Aug 2020 6:15 AM GMTకరోనా వైరస్... చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ మహమ్మారి, ఆ తరువాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ ప్రపంచం మొత్తం పాకిపోయింది. దీనితో ప్రపంచం మొత్తం లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అలాగే ఈ వైరస్ వెలుగులోకి వచ్చి 8 నెలలు కావొస్తున్నా కూడా దీనికి సరైన వ్యాక్సిన్ ను ఇంకా కనిపెట్టలేదు. వ్యాక్సిన్ కోసం చాలా దేశాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇకపోతే , కరోనా కారణంగా చిన్న సంస్థల నుండి పెద్ద పెద్ద సంస్థలు కూడా కుదేలైయ్యాయి. కొన్ని మల్టీ నేషనల్ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించేశాయి. ముఖ్యంగా కరోనా దెబ్బ అమెరికా పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ప్రపంచంలోనే నమోదు అయ్యే కరోనా కేసుల్లో సగానికి పైగా ఒక్క అమెరికాలోనే నమోదు అవుతున్నాయి. దీనితో చాలా కంపెనీలు దివాలా ప్రక్రియ కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు.
తాజాగా దివాలా ప్రక్రియకు అమెరికా కోర్టులో దిగ్గజ విమానయాన సంస్థ వర్జిన్ అట్లాంటిక్ దరఖాస్తు పెట్టుకుంది. కరోనా వైరస్ పరిణామాల నేపథ్యంలో విమానయాన పరిశ్రమ సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సంక్షోభాన్ని తట్టుకునే ప్రయత్నాల్లో భాగంగా వర్జిన్ అట్లాంటిక్ దివాలా ప్రక్రియకు వెళ్లాలని కీలక నిర్ణయం తీసుకుంది. న్యూయార్క్ లోని యూఎస్ ఫెడరల్ బ్యాంక్రప్టసీ కోర్టులో చాఫ్టర్ 15 కింద ఈ దరఖాస్తును సమర్పించింది. గత నెలలో ప్రకటించిన పునర్ వ్యవస్థీకరణ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లేందుకు దివాలా ప్రక్రియకు దరఖాస్తు అనేది యునైటెడ్ కింగ్ డమ్ లో కోర్టు ప్రక్రియలో భాగమని వర్జిన్ అట్లాంటిక్ కు చెందిన ఓ అధికార ప్రతినిధి తెలిపారు.
వర్జిన్ అట్లాంటిక్ వ్యవస్థాపకుడు బ్రిటన్‌కు చెందిన వ్యాపారవేత్త రిచర్డ్ బ్రాన్ సన్ కావడం గమనార్హం. ఈ దివాలా ప్రక్రియకు తమకు రుణాలిచ్చిన సంస్థల్లో చాలా వరకు అంగీకారం తెలిపాయని తెలిపాడు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో భాగంగా విధించిన ఆంక్షలతో ఏప్రిల్‌లో వర్జిన్ అట్లాంటిక్ కార్యకలాపాలు నిలిపివేసింది. జులైలో తిరిగి విమాన సేవలను పునరుద్ధరించింది. అయితే సుమారు 3,500 మంది ఉద్యోగులను కూడా ఈ సంస్థ తొలగించింది. వర్జిన్ అట్లాంటిక్ గత నెలలో 1.5 బిలియన్ డాలర్ల పునర్నిర్మాణ ఒప్పందాన్ని ఆవిష్కరించింది. దీనికి డెల్టా ఎయిర్ లైన్స్ సహా షేర్ హోల్డర్స్, రుణదాతల మద్దతు ఉన్నట్లు తెలిపింది.