Begin typing your search above and press return to search.

లైవ్ ఇస్తుండ‌గానే రిపోర్ట‌ర్‌, కెమెరామెన్‌ ల హ‌త్య‌!

By:  Tupaki Desk   |   26 Aug 2015 4:35 PM GMT


వర్జీనియాలో దారుణం జరిగింది. నిత్యం ప్రజలకు వార్తలు అందించే టీవీ రిపోర్టర్, కెమేరా మెన్ లు లైవ్ లో హత్యకావించబడ్డారు. నిత్యం బ్రేకింగ్‌ న్యూస్‌ లు అందించే ఆ జర్నలిస్టులు... తామే ఈరోజు ఒక బ్రేకింగ్‌ న్యూస్‌ గా మార‌తామ‌ని ఊహించి ఉండ‌రు! క్రైమ్ న్యూస్‌ ను అందించడంలో ఆసక్తి కనబరిచే వీరు... ఒక హంతకుడి చేతిలో దారుణంగా మరణిస్తామని అనుకుని ఉండరు.

విషయానికి వస్తే... వర్జీనియాలోని లైవ్ డబ్ల్యూ డీజేబీ టీవీ ఛనల్ కు చెందిన మహిళా రిపోర్టర్ అలిసన్ పార్కర్, వీడియో జర్నలిస్ట్ అడం వార్డ్ లు ఒక మహిళను లైవ్ లో ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంతలోనే అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన అగంతకుడు నిర్ధాక్షిణీయంగా రిపోర్టర్ ను టార్గెట్ చేసి కాల్పులు ప్రారంబించాడు! దీంతో సదరు రిపోర్టర్, కెమేరామెన్ అక్కడికక్కడే మరణించారు! ఆ సమయానికి వస్తున్న లైవ్‌ లో కింద‌పడిపోయిన కెమెరా నుంచి కాల్పుల దృశ్యాలు ప్ర‌సారం కావ‌డంతో విష‌యం అర్ధ‌మైంది.

video link:

http://abcnews.go.com/US/tv-reporter-cameraman-killed-gunman-opens-fire-virginia/story?id=33327920