Begin typing your search above and press return to search.
సుప్రీం కోర్టులో మళ్లీ వర్చువల్ విచారణలు
By: Tupaki Desk | 3 Jan 2022 11:30 AM GMTచైనాలో పుట్టిన వూహాన్ స్ట్రెయిన్ తో కలకలం రేపి.. భారత్ లో ఉత్పరివర్తనమైన డెల్టాతో దడదడలాడించిన కొవిడ్ ఇటీవల కాస్త తగ్గినట్లే కనిపించింది. కానీ, నవంబరు నెలాఖరులో అనూహ్యంగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమైక్రాన్ వేరియంట్ అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు రాత్రి వేళ జన సంచారంపై ఆంక్షలు అమలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, తమిళనాడులో విద్యా సంస్థలను మూసివేశారు.
మహారాష్ట్ర, ఢిల్ల్లీల్లో పరిస్థితి చేయి దాటుతోంది. ముంబై తరహాలో ఆంక్షలు అమలు చేస్తామని కర్ణాటక సీఎం బొమ్మై తెలిపారు. ఇక పోతే.. ఇప్పుడిప్పుడే భౌతిక విచారణల వైపు మళ్లుతున్న సుప్రీం కోర్టు.. కరోనా నేపథ్యంలో రాబోయే 2 వారాలు వర్చువల్‌గానే విచారణలు జరపాలని నిర్ణయించింది. కొవిడ్ వ్యాప్తి మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో కోర్టులను మూసేయాలని నిర్ణయించారు. ఇక వాదనలను నేరుగా కాకుండా వర్చువల్ గానే జరపాలని సర్క్యులర్ సైతం జారీ చేశారు.
కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇండియాలో వేగంగా విస్తరిస్తుండటం, అదే సమయంలో డెల్టా ఇతర వేరియంట్లు మళ్లీ తిరగబెట్టడం, రోజువారీ కేసులు తిరిగి 30వేల దగ్గరకు వస్తుండటం, జనవరి చివరి వారం నాటికి రోజువారీ కేసులు 2లక్షలకు చేరొచ్చనే అంచనాల నడుమ దేశం దాదాపు లాక్ డౌన్ దిశగా వెళుతోంది.
ఇప్పటికే చాలా రాష్ట్రాలు రాత్రి కర్ఫ్యూతోపాటు పగటి పూట వ్యాపార కలాపాలు, కార్యాలయాల్లో పనులపై ఆంక్షలు విధించాయి. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తాజాగా న్యాయ వ్యవస్థపైనా పడింది. ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రెండు వారాల పాటు కోర్టులో నేరుగా విచారణలు జరుపరాదని, కేవలం వర్చువల్‌గానే కేసుల పరిశీలన ఉంటుందని సుప్రీం కోర్టు నిర్ణయించింది.
సోమవారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం సర్క్యులర్‌ను జారీ చేశారు. సుప్రీంకోర్టు స్టాండర్డ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)కి సంబంధించి గత ఏడాది అక్టోబరు 7న జారీ చేసిన సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని కొత్త ప్రకటనలో పేర్కొన్నారు.కరోనా మహమ్మారి కారణంగా 2020 మార్చి నుంచీ సుప్రీంకోర్టు వీడియో కాన్ఫరెన్స్ విధానంలోనే కేసుల్ని విచారించింది.
అయితే.. బార్ సంఘాలు, న్యాయవాదుల డిమాండ్ మేరకు గత ఏడాది అక్టోబరు 7న కొత్త సర్క్యులర్‌ను జారీ చేసింది. సుదీర్ఘ విచారణ అవసరమైన కేసులను బుధ, గురువారాల్లో ప్రత్యక్షంగా కోర్టులోనే చేపడతామని అందులో స్పష్టం చేసింది. ప్రస్తుతం కేసుల పెరుగుతున్ననేపథ్యంలో.. ఆ నిర్ణయాన్ని తాత్కాలికంగా నిలిపేసింది.