Begin typing your search above and press return to search.

శ్రీకాళహస్తి ఆలయంలో వైరస్ కలకలం ... అర్చకుడికి పాజిటివ్ ?

By:  Tupaki Desk   |   10 Jun 2020 5:15 AM GMT
శ్రీకాళహస్తి ఆలయంలో వైరస్ కలకలం ... అర్చకుడికి పాజిటివ్ ?
X
దేశంలో వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. దీన్ని నివారించడానికి లాక్ డౌన్ ను విధించినా కూడా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయాయి. ఇదే సమయంలో లాక్ డౌన్ నుండి సడలింపులు ఇవ్వడంతో దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఐదో విడత లాక్ ‌డౌన్ సడలింపులతో కొనసాగుతోన్న వేళ.. ఇందులో భాగంగా అన్ని ఆలయాల్లోనూ భక్తుల ప్రవేశానికి అనుమతి ఇచ్చిన సమయంలో.. చిత్తూరు జిల్లాలోని ప్రఖ్యాత శ్రీకాళహస్తీశ్వరుడి ఆలయంలో వైరస్ కలకలం చెలరేగింది. శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా వైరస్ సోకిందని, ఫలితంగా ఈ తెల్లవారు జామునే ప్రారంభం కావాల్సిన ట్రయల్ రన్ వాయిదా పడింది అని , శుక్రవారం నుంచి భక్తుల రాకపై నిషేధం కొనసాగబోతోంది అని ప్రసారమాధ్యమాల్లో ప్రచారం అవుతుంది.

హిందూ సంప్రదాయం ప్రకారం రాహు, కేతువులు కూడా ప్రవేశించలేని ఆలయం ఈ శ్రీకాళహస్తీశ్వరుడి సన్నిధి. అందుకే సూర్య, చంద్రగ్రహణ సమయాల్లో తిరుమల సహా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముసేసినా కూడా శ్రీకాళహస్తి ఆలయంలో స్వామివారికి యధాతథంగా పూజలు కొనసాగుతుంటాయి. అలాంటి ఆలయంపై వైరస్ ప్రభావం పడిందని , అర్చకుడికి కరోనా వైరస్ పాజిటివ్ రావడంతో దర్శనాల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కార్యనిర్వహణాధికారి వెల్లడించారని , ట్రయల్ రన్ ‌ను వాయిదా వేశారని ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పష్టమైన ప్రకటన వెలువడాల్సి ఉంది.

కాగా, శ్రీకాళహస్తి దేవస్థానంలో అర్చుకులు, ఆలయ ఉద్యోగులు, పరిచారికలు, ఇతర సిబ్బంది మొత్తం 71 మంది పని చేస్తున్నారు. ఆలయంలో భక్తులకు ప్రవేశానికి అనుమతి ఇవ్వాల్సి ఉన్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా వారందరికీ వైరస్ పరీక్షలను నిర్వహించగా,. మొత్తం 15 మందికి సంబంధించిన రిపోర్టులు వచ్చాయి అని, అందులో ఓ అర్చకుడు వైరస్ పాజిటివ్‌గా తేలిందని, మిగిలిన వారి రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని ప్రచారం జరుగుతుంది. అయితే ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన అయితే ఇంకా వెలువడలేదు.