Begin typing your search above and press return to search.

మానవాళిపై వైరస్‌ల దాడి ఇంకా అయిపోలేదట

By:  Tupaki Desk   |   28 July 2021 11:30 PM GMT
మానవాళిపై వైరస్‌ల దాడి ఇంకా అయిపోలేదట
X
2019లో తొలి కొవిడ్ కేసు నమోదు కాగా, అప్పటి నుంచి ఈ మహమ్మారి మనుషులపై దాడి చేస్తూనే ఉంది. కరోనా దెబ్బకు దేశాలన్నీ అతలాకుతలమయ్యాయి. ఆర్థిక వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి. ఇక వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌లో ప్రజలు ఘోరమైన అవస్థలు పడ్డారు. ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా, త్వరలో థర్డ్ వేవ్ ముంపు ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే స్పెయిన్‌లో ఐదో వైవ్ వచ్చిందన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తుండగా, జనాలు తెగ భయపడుతున్నారు. ఇక మనుషులను ఈ వైరస్‌లు వదిలిపెట్టబోవని, వాడి దాడి ఇంకా కొనసాగుతుందనే చర్చ నడుస్తోంది.

ఈ క్రమంలో మానవాళిపై ఫ్యూచర్‌లో ఎలాంటి వైరస్‌లు అటాక్ చేయే చాన్స్ ఉంది? వాటికి ఏవి వాహకాలుగా పని చేయనున్నాయి? అనే ప్రశ్నలకు సమాధానాలు ఓ స్టడీ తెలిపింది. ఆ వివరాలేంటో తెలియాలంటే మీరు ఈ స్టోరీని ఫుల్లీ రీడ్ చేయాల్సిందే. మనుషులకు వైరస్ సోకడం కొత్తేం కాదన్న విషయం గత చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది. అయితే, ఇటీవల కాలంలో జంతువులు, పక్షుల నుంచి వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి. అవి ఎప్పుడూ జంతువుల్లో ఉంటాయి.

సడెన్‌గా మ్యుటేట్ అయి మనుషులపై అటాక్ చేస్తున్నాయి. యానిమల్స్, బర్డ్స్‌ నుంచి మానవాళికి రకరకాల అంటు వ్యాధులు సోకిన విషయం హిస్టరీలో రికార్డు అయి ఉంది. ఈ క్రమంలోనే మానవాళికి జంతువుల నుంచి వచ్చే వైరస్‌ల సంఖ్య ఏటా పెరుగుతూనే ఉందని శాస్త్రీయ అధ్యయనంలో తేలింది. కొవిడ్ మాత్రమే కాకుండా ఇతర వైరస్‌లు కూడా జనాల్ని ముప్పుతిప్పలు పెడుతున్నాయి. నిఫా, జికా, ఎబోలా వంటి ప్రమాదకర వ్యాధులు అడవి జంతువుల నుంచి వచ్చిందన్న విషయాన్ని వైద్య నిపుణులు ఆల్రెడీ ధ్రువకరించిన సంగతి అందరికీ విదితమే. అయితే, మనుషుల్లో ఉండే వైరస్‌లను గుర్తించేందుకు సైంటిస్టులు ఆసక్తి చూపుతుంటారు. ఆ విషయమై శాస్త్రీయ పరిశోధన చేసి గుర్తించారు కూడా.

యానిమల్స్, బర్డ్స్‌లో ఉండే వైరస్‌లను మాత్రం నిపుణులు ఇంకా పూర్తి స్థాయిలో గుర్తించలేదు. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. భూమ్మీద కొన్ని కోట్ల వైరస్‌లు ఉన్నాయని, వాటిలో మనం గుర్తించగలిగేవి చాలా తక్కువని వివరిస్తున్నారు. ఇలా వైరస్‌లు మనుషులపై అటాక్ చేయడానికి మెయిన్ రీజన్ దాదాపు అందరికీ తెలుసు. మితిమీరిన ప్లాస్టిక్ వినియోగం, కాలుష్యం పెరుగుదల ఫలితంగా ఎన్విరాన్‌మెంట్‌లో గణనీయమైన మార్పులు సంభవిస్తున్నాయి. మొత్తంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అది మానవాళి మనుగడను ప్రశ్నార్థకంగా చేస్తున్నది.

ఇక అడవుల విస్తీర్ణం గతంతో పోల్చితే భారీ స్థాయిలో తగ్గిపోతున్నాయి. మొక్కలు పెంచడం కంటే కూడా నరికివేతకే ప్రాధన్యమిస్తున్న సంగతి మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు కూడా కార్పొరేట్ కంపెనీస్‌కు ప్రాధాన్య మిస్తున్నాయి. అవి ఇక క్రమంగా సహజ వనరులను దెబ్బతీస్తున్నాయి. ఫలితంగా మానవాళిపై విపరీతమైన ప్రభావం పడుతున్నది.

ఈ నేపథ్యంలో ప్రజలు ప్రకృతిలో జీవించడం నేర్చుకోవాలని, అలా చేయడం వల్ల వైరస్‌ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎంతటి విపత్తు వచ్చినా కూడా ఎదిరించి నిలిచే మనో ధైర్యంను పెంపొందించుకోవాలంటూ మానసిక శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి విషయంలోనూ పాజిటివ్ గా ఆలోచిస్తూ అన్ని విషయాల్లో కూడా సానుకూలత ను ఆశించకుండా అన్నింటికి సర్దుకు పోయేలా మనని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది.