Begin typing your search above and press return to search.

రెండోసారి వైర‌స్ సోకుతుందా? లేదా? ‌శాస్త్రీయ విశ్లేష‌ణ‌

By:  Tupaki Desk   |   22 July 2020 2:30 AM GMT
రెండోసారి వైర‌స్ సోకుతుందా? లేదా? ‌శాస్త్రీయ విశ్లేష‌ణ‌
X
ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నా భార‌త‌దేశంలో మ‌హ‌మ్మారి వైర‌స్ సామూహిక వ్యాప్తి వ‌చ్చేసింది. దీంతో ఎవ‌రి నుంచి ఎవ‌రికి వైర‌స్ సోకుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఈ వైర‌స్ నుంచి పోరాడాలంటే మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి పెంచుకోవ‌డ‌మే మార్గం. మ‌న శ‌రీరంలోని రోగ నిరోధక శ‌క్తి ఆ వైర‌స్‌తో బ‌లంగా పోరాడి మ‌న‌ల్ని అనారోగ్యం పాలు కాకుండా చేస్తుంది. అయితే ఒక‌సారి వైర‌స్ బారిన ప‌డిన వారు మ‌రోసారి వైర‌స్ సోకుతుందా? అనేది స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా ఉంది. ఈ విష‌య‌మై శాస్త్ర‌వేత్త‌లు అధ్య‌య‌నం చేస్తున్నారు. ఎందుకంటే కొన్నిచోట్ల వైర‌స్ బారిన ప‌డి కోలుకున్న వారు మ‌ళ్లీ వైర‌స్ సోకిన సంఘ‌ట‌న‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో అస‌లు వైర‌స్ ఎలా ప్ర‌వేశిస్తుంది..? మ‌న రోగ నిరోధ‌క శ‌క్తి ఎలా ప‌ని చేస్తుంది? వైర‌స్ తో పోరాడే విధానం తెలుసుకుంటే మ‌న‌కు రెండోసారి వైర‌స్ సోకుతుందా? సోక‌దా అనేది తెలుస్తుంది. దీనిపై శాస్త్రీయ విశ్లేష‌ణ ఇలా ఉంది.

వాస్త‌వంగా మ‌న శ‌రీరంలోని రోగ నిరోధ‌క శ‌క్తి కీల‌కంగా ఉంటుంది. మ‌న ఆరోగ్యానికి అదే ర‌క్ష‌ణ‌గా నిలుస్తుంది. రోగ నిరోధక శ‌క్తి ఇన్ఫెక్ష‌న్స్ నుంచి పోరాడుతుంది. వైర‌స్‌పై దాడి చేస్తుంది. మ‌న శ‌రీరం తెల్ల ర‌క్త క‌ణాలు.. ర‌సాయ‌నాల‌ను విడుద‌ల చేస్తుంది. కొన్ని ర‌కాల యాంటీ బాడీల‌ను ఉత్ప‌త్తి చేస్తుంది. ఇవి వైర‌స్‌కు ప్రొటీన్‌లా అంటిపెట్టుకుని మ‌న క‌ణాల‌లో చేర‌కుండా అడ్డుకుంటాయి. ఇన్ఫెక్ష‌న్ సోకిన క‌ణాల‌ను గుర్తించి వాటిని హ‌రించేస్తాయి. ప్ర‌స్తుతం వ్యాప్తిస్తున్న మ‌హమ్మారి వైర‌స్ విష‌యంలోనూ ఇదే ప్ర‌క్రియ జ‌రుగుతుంది. అయితే ఈ వైర‌స్ శ‌క్తి అధికంగా ఉండ‌డంతో దీనితో పోర‌డానికి మాన‌వ శ‌రీరానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. మ‌న శ‌రీరంలో యాంటీ బాడీస్ అనేవి ఉంటే ఆ వైర‌స్‌తో పోరాడుతాయి. ఆ యాంటీ బాడీస్ త‌యారుచేయ‌డానికే వ్యాక్సిన్ క‌నిపెడ‌తారు. హాని చేయ‌ని వైర‌స్ భాగాన్ని శ‌రీరంలోకి ప్ర‌వేశ‌పెడ‌తారు.

అప్పుడు శ‌రీరంలో వైర‌స్ నుంచి పోరాడ‌డానికి శ‌క్తి వ‌స్తుంది. దీంతో శ‌రీరం అనారోగ్యానికి గురికాకుండా చేస్తాయి. నిజ‌మైన వైర‌స్‌ను గుర్తించి నాశ‌నం చేస్తుంది. ఆ యాంటీ బాడీస్ మానవ శ‌రీరంలో వైర‌స్ నాశ‌న‌మవుతుంది. దీంతో వైర‌స్ ఉనికి లేకుండాపోతుంది. ఈ విధంగా ప్ర‌జ‌లంద‌రికీ ఆ వ్యాక్సిన్ వేస్తే వైర‌సే ఉండ‌దు. అయితే ఆ యాంటీ బాడీలు తిర‌గ‌బెడితే మ‌ళ్లీ వైర‌స్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంది. అయితే ప్ర‌స్తుత వైర‌స్ ఏ ద‌శ‌లో మ‌ళ్లీ వ్యాపిస్తుందో తెలియ‌డం లేదు. దీనిపై ఇప్పుడు శాస్త్ర‌వేత్తలు అధ్య‌య‌నం చేస్తున్నారు. అంటే రెండోసారి కూడా వైర‌స్ బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని వివిధ అధ్య‌య‌నాల్లో తేలింది. దీన్ని బ‌ట్టి వైర‌స్ మ‌ళ్లీ సోకే ప్ర‌మాదం ఉంద‌ని.. ఎందుకైనా మంచిది జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని సూచిస్తున్నారు.