Begin typing your search above and press return to search.
భారత్ లో కరోనా స్వైరవిహారం ..ఒక్కరోజే 487 మంది మృతి !
By: Tupaki Desk | 9 July 2020 11:10 AM GMTభారత్ లో కరోనా వైరస్ విలయతాండవం చేస్తుంది. దేశాన్ని ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తుంది. ప్రతి రోజు దాదాపుగా 20 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అలాగే మృతుల సంఖ్య కూడా రోజురోజుకి భారీగా పెరుగుతోంది. ఇక దేశంలో పలు ఇప్పటికే పలు రాష్ట్రంలోని కంటైన్ మెంట్ జోన్ లలో జులై 31 వరకూ సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ మధ్య ప్రజా ప్రతినిధులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసు సిబ్బంది, నటులు కూడా ఈ వైరస్ భారిన పడుతున్నారు.
కాగా , తాజాగా గడచిన 24 గంటల్లో అత్యధికంగా 24,879 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 487 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకొని 19,547 మంది డిశ్చార్జి అయ్యారు. తాజా లెక్కలతో భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,67,296 కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారి నుంచి 4,76,378 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 21,129 మంది మరణించారు. ప్రస్తుతం మన దేశంలో 2,69,789 యాక్టివ్ కేసులున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. బుధవారం 1062 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అలాగే ఒక్క రోజే 12 మంది మృతి చెందారు. దీనితో ఏపీలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 22259కి చేరింది. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 11,101 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 264 మంది చనిపోయారు.
ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా బుధవారం నమోదు అయిన పాజిటివ్ కేసులతో కలిపి మొత్తం కరోనా కేసులు 30 వేలకు చేరువయ్యాయి. తాజాగా 1,924 కరోనా కొత్త కేసులు కలిపితే రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,536కు చేరుకుంది. అలాగే తెలంగాణలో కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 324కి చేరింది.