Begin typing your search above and press return to search.
పెళ్లి కాని ప్రసాద్ లను కాటేసిన `కరోనా`
By: Tupaki Desk | 24 Jun 2020 4:00 AM GMTమహమ్మారి వైరస్ వల్ల విధించిన లాక్ డౌన్ తో అంబానీ వంటి బడా పారిశ్రామికవేత్తలు మొదలు....అనామక వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తుల వరకు అంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాక్ డౌన్ పుణ్యమా అంటూ వైరస్ వ్యాప్తి చెందిన దేశాలతోపాటు భారత్ లోనూ నిరుద్యోగం పెరిగింది. కొన్ని సంస్థలు సగం మంది సిబ్బంది, ఉద్యోగులను తొలగించి భారం తగ్గించుకుంటుంటే, మరి కొన్నిసంస్థలు అరకొర జీతాలిచ్చి... ఉద్యోగులను పొమ్మనలేక పొగబెడుతున్నాయి. ఇక, లాక్ డౌన్ పుణ్యమా అంటూ చిరు వ్యాపారాలు మొదలు....చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దాదాపు దివాలా తీసే పరిస్థితికి వచ్చాయి.
ఈ నేపథ్యంలో ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్లు...కరోనా, లాక్ డౌన్ లు కలిసి చాలామంది బ్రహ్మచారుల మీద ఉరుములు లేని పిడుగుల్లా వచ్చిపడ్డాయి. పైన చెప్పిన కేటగిరీల్లో ఉద్యోగాలు కోల్పోయి, వ్యాపారాల్లో నష్టాలు వచ్చిన కొంతమంది పెళ్లి కాని ప్రసాద్ ల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఆస్తిపాస్తులు...ఐదంకెల జీతం...లక్షల్లో టర్నోవర్ చేసే బిజినెస్, ఇలా అన్నీ ఉంటేనే కాబోయే అల్లుడి నోట్లో శని ఉందేమో అని చూసే అమ్మాయిల తల్లిదండ్రులు కరోనా కాటు వేసిన కుర్రాళ్లను కూరగాయల్లో పుచ్చువంకాయల్లా ఏరివేస్తారేమోనన్న బెంగ కొందరు అబ్బాయిల తల్లిదండ్రులను కలవరపెడుతోంది.
ఎక్కడ ఎక్కడ ఎక్కడ ఉందో తారక...నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక, సౌందర్యలహరి...స్వప్న సుందరి...అంటూ లాక్ డౌన్ కు ముందు కొందరు పెళ్లి కాని ప్రసాద్ లంతా ఊహల్లో విహరించేవారు. అయితే, అనూహ్యంగా లాక్ డౌన్ వచ్చిపడడంతో వారి రంగుల కలలన్నీ కరిగిపోయాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ తో పాటల్లో హుషారు తగ్గి ఒకింత వైరాగ్యం వచ్చింది. పెళ్లెప్పుడవుతుంది బాబు....నాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు...., ఎందుకే రమణమ్మా... పెళ్లెందుకే రమణమ్మా తాను దూర సందు లేదు మెడకేమో డోలా...అంటూ లేని జోష్ తెచ్చుకొని మరీ ఈ పాట పాడుకుంటున్నారు కొందరు పెళ్లి కాని ప్రసాద్ లు. ఏదో రెండు పాటలు పాడి సరదాగా చెప్పినా...ఇది చాలా సీరియస్ మ్యాటర్ మరి.
ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి కొంతమంది అబ్బాయిలు సెటిల్ కావడానికి మరో ఏడాది...గట్టిగా మాట్లాడితే మరో రెండేళ్లు కూడా పట్టొచ్చు. ఈ లోపు సంబంధాలు దొరకడం కొంచెం కాదు..చాలా కష్టం. ఇక, కొందరి పరిస్థితయితే మరీ ఘోరంగా ఉంది. లాక్ డౌన్ కు ముందు పెళ్లి చూపులు జరిగి.. ఆల్రెడీ మాటల స్టేజ్ లో ఉన్న కొన్ని సంబంధాలు...నీటి బుడగల్లా తయారయ్యాయి. కుర్రాళ్లకు కరోనా కాటు పడడంతో కొన్ని సంబంధాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక మహమ్మారి వైరస్ జడలు విప్పుతున్న ఈ తరుణంలో....ఎవరికి కరోనా ఎప్పుడు ఎక్కడ సోకుతుందో తెలియని పరిస్థితుల్లో కొత్త సంబంధాల కోసం అన్వేషించాలన్న ఆలోచన కూడా అబ్బాయిల, అమ్మాయిల తల్లిదండ్రులకు రాకపోవచ్చు.
అయితే, గట్టిగా వెతికితే బాగా సెటిల్ అయిన అబ్బాయిలు దొరికే అవకాశముంది కాబట్టి... అమ్మాయిలకు కరోనా ఎఫెక్ట్ కొంత తక్కువనే చెప్పవచ్చు. అయితే, కరోనా ఎఫెక్ట్ లేదు కరీనా ఎఫెక్ట్ లేదు...అని దొరికిన మంచి సంబంధాన్ని వదులుకోకుండా సింపుల్ గా పెళ్లిళ్లు చేస్తున్నవారూ ఉన్నారు. మరి, కరోనా ...కరోనా...నన్నాగం జేసిందిరో, కరోనా వచ్చి `నా`కరీనా పోయే ఢాం..ఢాం...ఢాం అంటూ విషాదంలో మునిగితేలుతున్న ఆ కొందరు పెళ్లి కాని ప్రసాద్ లకు త్వరగా ఈ కరోనా కష్టాలు తొలగిపోయి...పెళ్లి పీటలెక్కే రోజులు అతి త్వరలో రావాలని ఆశిద్దాం.