Begin typing your search above and press return to search.
తెలుగు మీడియా సంస్థల్లో వైరస్ అలజడి !
By: Tupaki Desk | 9 Jun 2020 9:10 AM GMTఓ వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. ఒక్కోక్క దేశానికీ వ్యాప్తి చెందుతూ .. ప్రస్తుతం అన్ని దేశాలకి పాకింది. ప్రస్తుతం మనదేశంలో ఈ వైరస్ వ్యాప్తి రోజురోజుకి పెరిగిపోతుంది. దీన్ని అరికట్టడానికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతుంది. ఈ వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుండి వైరస్ వారియర్స్ గా పని చేస్తున్న వారిపై కూడా ఈ మహమ్మారి దాడిచేస్తుంది. డాక్టర్లు , పోలీసులు , వైద్య సిబ్బంది , మీడియా సిబ్బంది కూడా ఈ వైరస్ భారిన పడుతున్నారు.
ముఖ్యంగా తెలుగు మీడియా కూడా ఈ వైరస్ వ్యాప్తి గురించి , వైరస్ సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి చాలా విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ప్రాణాంతకమైన వైరస్ అని తెలిసినప్పటికీ కూడా జర్నలిస్ట్ లు , రిపోర్టర్లు ప్రాణాలని పనంగా పెట్టి వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా కొన్ని మీడియా సంస్థలు కొందరు ఉద్యోగుల్ని నిర్దాక్షణ్యంగా తొలగించేసాయి. లాక్ డౌన్ వల్ల కలిగే ఆర్థిక నష్టం నుండి సంస్థను కాపాడుకోవడానికి కొందరి ఉద్యోగాలు పీకిపారేయగా ..కొందరి జీతాల్లో కోతలు విధించారు. అయినప్పటికీ జర్నలిస్ట్ లు తమ బాధ్యతని మరువకుండా ప్రజలని చైతన్య పరచడం కోసం...క్లిష్ట సమయంలో కూడా అరకొర సౌకర్యాలతోనే విధులు నిర్వర్తిస్తున్నారు. కొన్ని సంస్థలు వారికీ కావాల్సిన కనీస సదుపాయాలని ఏర్పాటు చేయడం లో కూడా విఫలం అయ్యాయి.
మీడియా సంస్థలు జర్నలిస్ట్ ల ఆరోగ్యం పై కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకపోవడం కరోనా విజృంభిస్తోంది. మొన్నటికిమొన్న టీవీ5 ఛానెల్ రిపోర్టర్ వైరస్ కారణంగా మృతిచెందాడు. అంతకంటే ముందే మరో ఛానెల్ లో ఓ వ్యక్తికి వైరస్ పాజిటివ్ అని తేలింది. అయితే ఆ విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలన్నీ కావాలనే బయటకి రాకుండా అడ్డుకున్నాయి. అయితే, ఓ మరణం సంభవించిందో ..అన్ని విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. టీవీ5 రిపోర్టర్ మరణంతో ఛానెళ్లు ఇప్పుడు జాగ్రత్తల్లో పడ్డాయి. మీడియాలో కరోనా వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
తాజాగా మరో న్యూస్ ఛానెల్ లో వైరస్ పాజిటివ్ కేసు బయటపడింది. దీంతో అతడ్ని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. అతడి కుటుంబ సభ్యులతో పాటు, మరికొంతమంది ఛానెల్ సిబ్బందిని సెల్ఫ్ క్వారంటైన్ లో పెట్టారు. ప్రస్తుతానికి బయటపడిన ఉదంతాలు కొన్ని మాత్రమే...వెలుగులోకి రాని ఉదంతాలు ఇంకెన్నో. మీడియా సంస్థలు కనీసం వైరస్ సోకినా విషయాన్ని బయటపెట్టకపోయినా కూడా వారి సంస్థల్లో పనిచేసే జర్నలిస్ట్ లకి వైరస్ సోకితే వారికీ సహాయంగా నిలిస్తే చాలా బాగుంటుంది. ఏప్రిల్ లోనే ముంబయి, చెన్నైలోని కొన్ని మీడియా సంస్థల్లో వైరస్ కేసులు నమోదు అయ్యాయి. ఆ విషయాన్ని పరిగణలోకి తీసుకోని తెలుగు మీడియా సంస్థలు ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేది. ఎప్పటికైనా కూడా యాజమాన్యాలు ఎవరి పాపానా వారే పోతారు అని కాకుండా ...ఉద్యోగుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి.