Begin typing your search above and press return to search.

వీడియో సాక్ష్యంః వైర‌స్ చైనా ల్యాబ్ నుంచే..?

By:  Tupaki Desk   |   14 Jun 2021 11:30 PM GMT
వీడియో సాక్ష్యంః వైర‌స్ చైనా ల్యాబ్ నుంచే..?
X
కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే బయటపడిందనే అనుమానాలు మొదట్నుంచీ ఉన్నాయి. కానీ.. అదంతా దుష్ప్ర‌చారం అని చెబుతూ వ‌స్తోంది చైనా. అమెరికా స‌హా ప‌లు దేశాలు మాత్రం ఈ వైర‌స్ ను ఖ‌చ్చితంగా చైనా సృష్టించిందేన‌ని, వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే ప్ర‌పంచానికి విస్త‌రించింద‌ని అంటున్నాయి. అయితే.. తాజాగా బ‌ల‌మైన ఆధారం ఒక‌టి చ‌క్క‌ర్లు కొడుతోంది. వుహాన్ ల్యాబ్ లో గ‌బ్బిలాలు పెంచుతున్నార‌నే ఓ వీడియో ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది.

వుహాన్ లోని వైరాల‌జీ ల్యాబ్ ను 2017 మేలో ప్రారంభించారు. ఆ స‌మ‌యంలో చైనీస్ అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్ చిత్రీక‌రించిన ఓ వీడియోను స్కై న్యూస్ ప్ర‌సారం చేసింది. బోన్ల‌లో గ‌బ్బిలాల‌ను పెంచుతున్న దృశ్యాలు ఈ వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. అంతేకాదు.. శాస్త్ర‌వేత్త‌లు వాటినిప‌ట్టుకొని పురుగుల‌ను ఆహారంగా ఇస్తున్న దృశ్యాలు కూడా వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోకు ‘వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాల‌జీ పీ4 ల్యాబ్ నిర్మాణం - ప‌రిశోధ‌న‌లు’ అని పేరు పెట్టడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. చైనా తీసుకుంటున్న ప‌లు చ‌ర్య‌లు, చెబుతున్న స‌మాధానాలు అనుమానాల‌ను పెంచేవిగా ఉన్నాయి. వైరాల్ ఇనిస్టిట్యూట్ లోని పూర్తి డేటాను, సేఫ్టీ లాగ్స్ ను బ‌య‌ట పెట్ట‌ట్లేదు. అంతేకాదు.. గ‌బ్బిలాల‌పై సాగించిన ప‌రిశోధ‌న‌ల తాలూకు రికార్డుల‌ను కూడా చూపించ‌ట్లేదు. దీంతోపాటు వుహాన్ లోని బ్ల‌డ్ బ్యాంక్ లో 2019 డిసెంబ‌ర్ క‌న్నా ముందు న‌మూనాల‌ను ప‌రిశీలించ‌డానికి కూడా చైనా అంగీక‌రించ‌లేదు.

ఈ విధంగా చైనా తీరు ఎన్నో విష‌యాల్లో అనుమానాస్ప‌దంగా ఉంటోంది. ఇవ‌న్నీ వుహాన్ నుంచే వైర‌స్ ఉద్భ‌వించింద‌నే సందేహాల‌ను పెంచుతున్నాయి. ఈ సందేహాల‌ను బ‌ల‌ప‌రుస్తూ ఇప్పుడు ల్యాబ్ ప్రారంభం నాటి వీడియో వీడియో బ‌య‌ట‌కు రావ‌డం, అందులో గ‌బ్బిలాలు ఉండ‌డంతో.. అనుమానాలు మ‌రింత‌గా బ‌ల‌ప‌డుతున్నాయి.