Begin typing your search above and press return to search.

ప్లాస్మా థెరపీతో వైరస్ మ్యూటేషన్లు..!

By:  Tupaki Desk   |   23 May 2021 3:30 PM GMT
ప్లాస్మా థెరపీతో వైరస్ మ్యూటేషన్లు..!
X
కరోనా కాలంలో ప్లాస్మా థెరపీకి మంచి స్పందన లభించింది. ఈ చికిత్సతో మరణాలను కొంతవరకు తగ్గించవచ్చని వైద్యులు చెప్పిన సంగతి తెల్సిందే. అలాంటి ప్లాస్మా థెరపీని కొవిడ్ చికిత్స నుంచి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ తొలగించింది. ఈ వైద్య విధానంతో బాధితులకు పెద్దగా ప్రయోజనం లేదని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. అందుకే కరోనా చికిత్స మార్గదర్శకాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కానీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భిన్నమైన ప్రకటన వెలువరించింది.

కరోనా బాధితుడి అంగీకారంతో ప్లాస్మా థెరపీని చేయవచ్చని ఐఎంఏ ప్రకటించింది. ఈ రెండు ప్రకటనలతో ప్లాస్మా థెరపీపై అనేక సందేహాలు వెలువడుతున్నాయి. ప్లాస్మా థెరపీ ఫలితాలను కచ్చితంగా అంచనా వేయలేమని ఐఎంఏ అభిప్రాయపడింది. ఒక్కో వ్యక్తిలో ఒక్కో స్పందన ఉంటుందని ఐఎంఏ ఫైనాన్షియల్ సెక్రటరీ తెలిపారు. బాధితుడి నుంచి రాత పూర్వక అంగీకారం తీసుకున్న తర్వాత ఈ చికిత్స చేయవచ్చని సూచించారు.

ప్లాస్మా థెరపీ ప్రయోజనాల పట్ల బలమైన ఆధారాలు లేకపోవడం వల్ల దీనిని తొలిగించిందని పేర్కొన్నారు. ఐసీఎంఆర్ ప్రకటన పట్ల తమకేం అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బందికి చట్టపరమైన నిబంధనలేమి లేవని వెల్లడించారు. వైద్య సిబ్బందికి ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందించాల్సి ఉంటుందని వివరించారు. అయితే స్వల్పంగా కొవిడ్ పై ప్రభావం చూపుతుందని అన్నారు. కరోనాపై పూర్తి స్థాయిలో ప్రభావం చూపని ఎన్నో రకాల మందులను ఉపయోగిస్తున్నామని ఆయన గుర్తు చేశారు.

వైరస్ ను ఎదుర్కొనే యాంటీబాడీలు ఉన్న ప్లాస్మాను రోగి రక్తంలోకి ప్రవేశపెట్టడమే ప్లాస్మా చికిత్స. ఈ క్రమంలో వైరస్ యాంటీబాడీలపై దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి మ్యూటేట్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మ్యూటేంట్లకు కారణం ప్లాస్మా థెరపీ అని ఇంగ్లండ్ లో ఓ నివేదికలై వెల్లడించారు. ఈ చికిత్స విధానం రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. అందుకే దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.