Begin typing your search above and press return to search.
ఢిల్లీ మెట్రోలో వైరస్ కలకలం: ఏకంగా 20 మంది సిబ్బందికి పాజిటివ్
By: Tupaki Desk | 5 Jun 2020 6:46 AM GMTదేశవ్యాప్తంగా ఐదో దశ లాక్‌డౌన్ ఇల్లు తెరచి ఉంచి తాళం వేసినట్టు పరిస్థితి ఉంది. పేరుకు లాక్‌డౌన్ ఉన్నా అన్ని వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలతో పాటు అన్ని రంగాలు దాదాపు తెరచుకుంటున్నాయి. ఇండియా ఈజ్ బ్యాక్ అని పేర్కొంటున్నారు. సాధారణంగా జన జీవనం మారింది. ఈ పరిస్థితుల్లో ప్రజా రవాణా అంతంతగా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే మెట్రో సర్వీస్‌లు కూడా మొదలుపెట్టాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఢిల్లీ మెట్రో అధికారులకు షాక్ తగిలింది. మెట్రో రైల్‌లో పని చేసే సిబ్బందిలో ఏకంగా 20 మంది ఆ వైరస్ బారిన పడ్డారు. వారికి పాజిటివ్ నిర్ధారణ కావడంతో మెట్రో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో ఉంటున్న 20 మంది మెట్రో సిబ్బందికి ఇప్పటివరకు పాజిటివ్‌గా తేలినట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.
ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్‌లో పనిచేస్తూ.. ఢిల్లీతోపాటు పరిసర నగరాల్లో నివసిస్తున్నారు. విధుల్లో లేని సమయంలోనే వారికి పాజిటివ్ సోకడంతో కొంత ఉపశమనం కలిగించే విషయం. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు, డీవీఎంఆర్సీ కూడా వైరస్‌కు వ్యతిరేకంగా పోరాడుతోంది. మెట్రో వ్యవస్థను ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్న సమయంలోనే ఈ వార్త తెలియడంతో మెట్రో సేవలు ప్రారంభమవుతాయా లేదా అనేది సందిగ్ధంలో పడింది. అయితే సేవలు ప్రారంభించేందుకు ఢిల్లీ మెట్రోరైలు అధికారులు సిద్ధమయ్యారని సమాచారం. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాక వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకొని మెట్రోరైలు సర్వీసులు పునఃప్రారంభించేందుకు తాము సిద్ధమని మెట్రో అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగా మెట్రో రైలు కార్యాలయాలు, రైల్వేస్టేషన్లను శానిటైజ్ చేయించి వైరస్ సోకకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.