Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కు పాజిటివ్!
By: Tupaki Desk | 10 July 2020 5:15 AM GMTఏపీలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, మంత్రుల వరకు వచ్చిన కరోనా ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. జనంలోకి వెళ్లేవారికి.. వివిధ కార్యక్రమాల్లో తిరిగే వారికి ఈ మహమ్మారి ఎక్కువగా సోకుతోంది. దీంతో యాక్టివ్ గా ఉండే ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతల్లో కరోనా టెన్షన్ రేపుతోంది.
తాజాగా ప్రముఖ ప్రజా ప్రతినిధుల భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బంది కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సీఎం కేసీఆర్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది 30మందికి కరోనా సోకిందనే ప్రచారం సాగుతోంది.
తాజాగా ఏపీఐఐసీ చైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా గన్ మెన్ కూడా కరోనా బారినపడ్డాడు. తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి అతడిని తరలించి చికిత్స అందిస్తున్నారు.
రోజా గన్ మెన్ కు కరోనా పాజిటివ్ రావడం.. ఆమె ఇటీవల మాస్క్ లేకుండానే 108 ల ప్రారంభోత్సవం సహా పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
అయితే తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. కరోనా బారిన తన గన్ మెన్ సెలవులో ఉన్నాడని రోజా తెలిపారు. 18 రోజులుగా విధులకు రావడం లేదని ఆమె వివరించారు. దీంతో రోజా ఆరోగ్యంపై ఆందోళన వీడింది.