Begin typing your search above and press return to search.
హైదరాబాద్ లో భారీగా కరోనా టెస్టులు ...65 కేంద్రాల్లో ర్యాపిడ్ టెస్టులు !
By: Tupaki Desk | 15 July 2020 2:00 PM GMTదేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తోంది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతూన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో కరోనా పరీక్షలు విస్తృతం చేశామని, కరోనా మహమ్మారి లక్షణాలు కనిపిస్తే ఎవరైనా యాంటిజన్ పరీక్షలు చేయించుకోవచ్చని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెల్లడించారు. కరోనా వైరస్ కట్టడికోసం హైదరాబాద్ లో చేపట్టిన చర్యలను ఆయన తెలిపారు.
ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యాంటిజన్ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం నగరంలో 65 కేంద్రాల్లో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఐసోలేషన్ లో ఉండాలనుకుంటే నేచుర్ క్యూర్, ఆయుర్వేద ఆసుపత్రుల్లో పడకలు అందుబాటులో ఉన్నాయని వివరించారు. హోం ఐసోలేషన్ లేనివారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని తెలిపారు. సెల్ఫ్ డిక్లరేషన్ మీదనే హోం ఐసోలేషన్ కు పంపిస్తామన్నారు. హైదరాబాద్ లో ఇప్పటి వరకు 11,705 మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారని తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉండే వారికి ఔషధాలతో కూడిన కిట్ ఇస్తున్నామని స్పష్టంచేశారు.
కాగా, తెలంగాణలో మంగళవారం మరో 1,524 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 37,745కి చేరింది. ఇక మంగళవారం నాడు కరోనా నుంచి కోలుకుని 1,161 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా నుంచి కోలుకుని 24,840 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.