Begin typing your search above and press return to search.

క్రిప్టో కరెన్సీపై వీసా సంచలన నిర్ణయం

By:  Tupaki Desk   |   30 March 2021 5:30 PM GMT
క్రిప్టో కరెన్సీపై వీసా సంచలన నిర్ణయం
X
అన్ని దేశాల కరెన్సీలకు ప్రత్మామ్మాయంగా అవతరించిన ఆన్ లైన్ కరెన్సీనే ‘క్రిప్టో కరెన్సీ’. ఈ డిజిటల్ కరెన్సీని ప్రపంచవ్యాప్తంగా వినియోగానికి అందరూ తెగ వాడేస్తున్నారు. నానాటికీ క్రిప్టో కరెన్సీకి డిమాండ్ పెరుగుతోంది.

ఈ క్రమంలో క్రిప్టో కరెన్సీకి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ ఎలక్ట్రానిక్ చెల్లింపుల సంస్థ వీసా కీలక నిర్ణయం తీసుకుంది.

ఇథీరియమ్ నెట్ వర్క్ ద్వారా డిజిటల్ కరెన్సీ యూఎస్డీ కాయిన్ లో చెల్లింపులు జరిపేందుకు అనుమతిస్తున్నట్టు తాజాగా ప్రకటించింది. వీసా సంస్థ తీసుకున్న ఈ కీలక నిర్ణయం వల్ల పెట్టుబడులు పెరిగే అవకాశం ఉంది.

వీసా తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ డిజిటల్రెన్సీని సాధారణ నగదు రూపంలో మార్చే అవసరం తప్పనుంది. వీసా కంటే ముందే ఇతర ప్రముఖ సంస్థలైన బీఎన్ వై మెలన్, బ్లాక్ రాక్, మాస్టర్ కార్డ్ వంటి సంస్థలు డిజిటల్ కరెన్సీ చెల్లింపులకు అనుమతించాయి.

ఇది వాణిజ్యంలో క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఒక కీలక ముందడుగుగా చెప్పుకోవాలి. ఇప్పటివరకు వీసా ద్వారా క్రిప్టో కరెన్సీలో చెల్లింపులు చేయాలంటే వీటిని ముందుగా సాధారణ నగదులోకి మార్చాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు వీసా అనుమతి ఇవ్వడంతో ఈ నగదు మార్పిడి అవసరం తప్పిపోయింది.