Begin typing your search above and press return to search.
విశాఖ టీడీపీలో నెక్స్ట్ వికెట్ ఆయనేనా?
By: Tupaki Desk | 21 Nov 2019 7:14 AM GMTవిశాఖపట్నం టీడీపీ నుంచి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతారని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నా ఇంతవరకు ఆయన ఎటూ తేల్చలేదు. అయితే, ఆ జిల్లాకే చెందిన మరో కీలక నేత టీడీపీని వీడడానికి ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. ఆయన కూడా గంటా వర్గానికే చెందిన నేత అని చెబుతున్నారు. ఆయన పార్టీని వీడడానికి నారా లోకేశ్‌తో విభేదాలే కారణమన్న ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుతో మంచి సంబంధాలున్న ఆ నేతకు లోకేశ్‌తో మొదటి నుంచి పడడం లేదని.. ఆ కారణంగానే గతంలోనూ ఆయన పలుమార్లు సొంత పార్టీపై నిరసన గళం వినిపించారని చెబుతున్నారు. ఆయన పార్టీ నుంచి వెళ్లిపోవాలని లోకేశ్ కూడా కోరుకుంటున్నారని.. ఆయన పార్టీలో కొనసాగితే తనకు వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటారన్న ఉద్దేశంతో ఆయన నిష్క్రమణనే లోకేశ్ కోరుకుంటున్నారని చెబుతున్నారు.
లోకేష్ పూర్తిగా తన వర్గాన్నే నిర్మించుకుంటున్నారని.. ఆ క్రమంలోనే సీనియర్లు, తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారికి పొగ పెడుతున్నారని చెబుతున్నారు. ఎలాగూ పార్టీ అధికారంలో లేదు కాబట్టి ఇప్పుడు పాత నీళ్లను వదిలేసి కొత్త నీళ్లతో ఫ్రెష్ నెస్ తేవాలని లోకేశ్ అంటున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖకు చెందిన ఆ టీడీపీ నాయకుడు వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆయన జగన్‌తో భేటీ కానున్నట్లు చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఆయనతో మాట్లాడి మళ్లీ ఎన్నికల వరకు వేచి చూడాలని చెప్పినప్పటికీ ఆయన మాత్రం తనకు లోకేశ్‌తో ఇబ్బందులున్నాయని చంద్రబాబుకు కూడా స్పష్టం చేశారని చెబుతున్నారు.