Begin typing your search above and press return to search.

ఏపీకి కేంద్రం తాజా షాక్ ఇదే

By:  Tupaki Desk   |   29 July 2018 1:56 PM GMT
ఏపీకి కేంద్రం తాజా షాక్ ఇదే
X
కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ షాకుల పరంపర కొనసాగుతోంది. విభజనకు సంబంధించి ఇప్పటివకే వివిధ షాకుల పరంపర కొనసాగుతుండగా దానికి తాజాగా కేంద్ర హోంశాఖ మరో ఊహించని సమాచారాన్ని అందించింది. ఇప్పటికే ఏపీకి చెందిన పలు అంశాల్లో మొండిచేయి చూపినట్లే…కీలకమైన రైల్వే జోన్ విషయంలోనూ అదే నిర్ణయం తీసుకుంది. ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజ్యసభలో ప్రత్యేక హోదాపై జరిగిన చర్చలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అయితే రాజ్ నాథ్ సింగ్ ప్రకటనకు భిన్నంగా ఏపీకి అన్యాయం చేసేలా సుప్రీంకు కేంద్ర అఫిడవిట్ సమర్పించడం గమనార్హం.

తెలంగాణకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ కు స్పందిస్తూ కేంద్ర హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేసింది. ఇప్పటికే 16 జోన్లు ఉన్నందున కొత్త జోన్ లాభాదాయకం కాదని తెలిపిన రైల్వే శాఖ తెలిపిందని అఫిడవిట్లో పేర్కొంది. విశాఖ జోన్ విషయంలో రైల్వే అధికారులు చేతులెత్తేశారని హోంశాఖ అఫిడవిట్ లో పేర్కొంది. కీలకమై విజయవాడ మెట్రో సాధ్యం కాదనే సంకేతాన్ని ఈ అఫిడవిట్లో కేంద్రం తెలియజెప్పింది. నూతన మెట్రో పాలసీకి అనుగుణంగా ఉంటేనే విజయవాడకు మెట్రో ఇస్తామని తెలిపింది.

పదో షెడ్యుల్లోని సంస్థల సర్వీసులను మాత్రమే…మరో రాష్ట్రానికి అందజేయాలని విభజన చట్టంలో ఉందని తేల్చేసింది. ఉన్నత విద్యామండలి ఆస్తులను జనాభా ప్రాతిపదికన పంచాలని గతంలో సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా.. అందుకు విరుద్ధంగా హోంశాఖ అఫిడవిట్ దాఖలు చేయడం కలకం రేపుతోంది. అమరావతి నిర్మాణం నిధులపైనా స్పష్టత ఇవ్వలేదు కేంద్ర హోంశాఖ. ఇప్పటికే రూ. 15 వేల కోట్లకు యూసీ ఇచ్చారంటూ అఫిడవిట్ ఇచ్చింది. 753 మంది ఉద్యోగుల విభజన పెండింగ్ లో ఉందన్న హోంశాఖ .. అనేక సంస్థల ఏర్పాటు ఇంకా డీపీఆర్ తయారీ.. ఆమోదం దశలోనే ఉన్నాయని మాత్రం అంగీకరించింది. ఇటీవలే విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చామని ప్రత్యేక హోదా సాధ్యం కాదని కేంద్రం సుప్రీంకోర్టుకు తేల్చిచెప్పింది. అభివృద్ధికి పన్ను రాయితీలు- మినహాయింపులపై సందర్భానుసారం చర్యలు చేపట్టినట్టు తెలిపింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆధారంగా రెవెన్యూ లోటు పూడ్చామని వివరించింది. కేంద్ర, రాష్ట్రాల మధ్య పన్ను పంపకాలు పూర్తయ్యాయని తేల్చేసింది. పోలవరం ప్రాజెక్టులోని ఇరిగేషన్ కాంపోనెంట్కు 100శాతం నిధులు ఇస్తామని, నీతి అయోగ్ సిఫార్సుల మేరకు ప్రాజెక్టును వేగంగా నిర్మించే బాధ్యత రాష్ట్రానికే అప్పగించినట్లు కేంద్రం తెలిపింది.