Begin typing your search above and press return to search.
విశాఖ వైసీపీ సీనియర్‌కు సీటు గండం.. ఏం జరుగుతోందంటే..!
By: Tupaki Desk | 26 Aug 2022 11:30 AM GMTవైసీపీలో కొందరు సీనియర్ నాయకులు టికెట్ల గండం పొంచి ఉందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. అయితే.. అది వారి పెర్ఫార్మెన్స్‌ను బట్టి.. లేదా.. వారికి ప్రజలకు మధ్య ఉన్న గ్యాప్‌ను బట్టి ఆధారపడి ఉంటుందని.. పార్టీ అధిష్టానం పదే పదే చెబుతోంది. అయితే.. దీనికి విరుద్ధంగా కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులతో విభేదాలు.. లేదా.. మంత్రులు కొన్ని నియోజక వర్గాలపై కన్నేయడం.. ఇవన్నీ కాకుండా.. పార్టీ నేతలతో ఉన్న వివాదాల కారణంగా .. మరికొందరు పార్టీ టికెట్లు కోల్పోయే పరి స్థితి వస్తోందనే సంకేతాలు వస్తున్నాయి.
ఇలాంటి వారిలో ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి నియోజకవర్గం ఎమ్మెల్యే కన్నబాబు రాజు ముందు వరుసలో ఉన్నారని అంటున్నారు. ఇప్పటికే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యేకు అధిష్టానం సెగ పెట్టింది. ఆమెకు టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని..
స్పష్టం చేసేసింది. అయితే.. ఇప్పుడు అధిష్టానం కాకుండా.. అధిష్టానానికి అత్యంత చేరువగా ఉన్న మంత్రి ఒకరు.. ఇదే జిల్లాకు చెందిన యువ నాయకుడు.. కన్నబాబు రాజుకు సెగ పెడుతున్నారనే చర్చజోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ రాదని.. ఆయన వల్ల ఏమీ కాదని.. సదరు మంత్రి అనుచరులు ప్రచారం చేస్తున్నారు.
దీనికితోడు.. మంత్రి అనుచరులు.. ఎమ్మెల్యే వర్గాన్ని విడదీసి.. తమవైపు తిప్పుకోవడం కూడా.. ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. వాస్తవానికి ఇవన్నీ కూడా.. మంత్రి కనుసన్నల్లో నే జరుగుతున్నాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో యలమంచిలి నుంచి పోటీ చేయాలని సదరు మంత్రి ప్రయత్నాలు చేస్తున్నారట. తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో తనకు వ్యతిరేకంగా కొందరు ప్రచారం చేస్తున్నారని.. ఇది ప్రజల్లోకి బాగా వెళ్లిందని.. ఇప్పుడు దానిని మార్చడం కష్టమని.. ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో కాపులు ఎక్కువగా ఉన్న యలమంచిలి.. నియోజకవర్గాన్ని ఆయన ఎంచుకునే ప్రయత్నంలో ఉన్నారని.. అందుకే ఇక్కడ వారానికి రెండు సార్లు సదరు మంత్రి పర్యటిస్తున్నారని.. ఇక్కడ ఏం జరుగుతున్నా తెలుసుకుంటున్నారని.. పరిశీలకులుచెబుతున్నారు.
అంతేకాదు.. మండల స్థాయి నాయకులను కూడా తనవైపు తిప్పుకునే ప్రయత్నంలో ఆయన సక్సెస్ అయ్యారని చెబుతున్నారు. ఈ పరిణామాలతో ఎమ్మెల్యే కన్నబాబురాజు సందిగ్ధంలో పడిపోయారు. అధిష్టానం దగ్గర పలుకుబడి ఉన్న మంత్రి తనకు ఎసరు పెట్టేందుకు సిద్ధం కావడంతో ఆయన అధిష్టానం దగ్గరే తేల్చుకునేందుకురెడీ అవుతున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.