Begin typing your search above and press return to search.

విశాల హృదయంలో ఆయనకూ చోటూ.. వైసీపీకి షాక్....?

By:  Tupaki Desk   |   20 Dec 2022 9:30 AM GMT
విశాల హృదయంలో ఆయనకూ చోటూ.. వైసీపీకి షాక్....?
X
తెలుగు తమిళ హీరో అందరికీ పరిచయమే. ఆయన్ సినిమాలు పొగరు, పందెం కోడి వంటివి తెలుగుద్లో మంచి విజయాన్ని నమోదు చేసాయి. స్వతహాగా తెలుగువాడు అయిన విశాల్ తమిళ సీమకు వెళ్లి అక్కడ నెగ్గుకు వస్తున్నాడు. కోలీవుడ్ లోని నడిగర్ సంఘం ఎన్నికల్లో కూడా ఆయన పాలుపంచుకుని ప్రముఖుడిగా నిలిచారు.

విశాల్ ఇపుడు తెలుగువారికి హీరోగానే కాదు ఒక రాజకీయ నేతగా కనిపించబోతున్నారా అంటే అది ఇపుడు ఆసక్తికరమైన చర్చగానే ఉంది. రాజకీయం అంటేనే అనూహ్యం. ఎపుడేమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. అయితే విశాల్ మావాడు మా అభ్యర్ధి కుప్పం సీటు నుంచి కాబోయే ఎమ్మెల్యే అని వైసీపీ జబ్బలు చరచుకుంటోంది. కానీ వైసీపీ కి షాక్ ఇచ్చేలా విశాల్ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు.

తనకు జగన్ అంటే ఇష్టం. అది రాజకీయాల వరకూ ఉంది. కానీ తనకు పవన్ కళ్యాణ్ అంటే కూడా చాలా ఇష్టమని విశాల్ చెబుతూ వైసీపీకి గట్టి షాక్ ఇచ్చేశారు. నిజానికి ఏపీలో పవన్ వైసీపీకి కొరకరాని కొయ్యలా మారారు. ఆయన్ని విమర్శించడమే తప్ప మరో మాటే వైసీపీకి లేకుండా పోతోంది. అలాంటి టైం లో విశాల్ మావాడు అని వైసీపీ చెప్పుకుంటూ మాకూ ఒక హీరో దొరికాడు అని మురిసిపోతున్న టైం లో విశాల్ నోటి నుంచి పవన్ గ్రేట్ అన్న మాటలు రావడం అంటే తట్తుకోవడం కష్టమే.

మరి ఆయన్ని పిలిచారో లేక ఆయనే జగన్ అపాయింట్మెంట్ కోరారో తెలియదు కానీ సీఎం అపాయింట్మెంట్ భేటీ అంటూ వార్తలు వస్తున్న టైం లో పవన్ని విశాల్ పొగడడం అంటే అది కచ్చితంగా ఫ్యాన్ పార్టీకి మింగుడుపడని వ్యవహారమే అంటున్నారు. ఇక విశాల్ పవన్ గురించి చాలానే చెప్పారు. పవన్ ది ఒక ప్రత్యేకమైన స్టైల్ అని, ఆయన నటన, ఆయన ఇమేజ్ వేరు అని కూడా కితాబు ఇచ్చారు. సినిమాల వరకూ తాను పవన్ ఫ్యాన్ ని అని చెప్పేసుకున్నారు.

మరి వైసీపీ వారు దీన్ని ఎలా చూస్తారో ఎలా అర్ధం చేసుకుంటారో ఆలోచించాల్సిందే. పవన్ కళ్యాణ్ తనకు తాను హీరో కాక ముందు నుంచి తెలుసు అని ఆయన గ్రేట్ అని విశాల్ అనడం ఆయన విశాల హృదయానికి ఉదాహరణ కావచ్చేమో కానీ విని తట్టుకునే విశాల హృదయం వైసీపీ వారికి ఉందా అన్నదే పెద్ద డౌట్. ఏది ఏమైనా విశాల్ జగన్ నా పొలిటిక్ హీరో అంటున్నారు. పవన్ని తన సినిమా హీరో అంటున్నారు. ఇలా అటు వైసీపీ ఇటు జనసేనలు రెండింటికీ సమ న్యాయం చేశారు కానీ దాన్ని ఆ రెండు పార్టీలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలని అంటున్నారు. మొత్తానికి విశాల్ చాలా ఆచీ తూచీనే మాట్లాడారు అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.