Begin typing your search above and press return to search.
ఢిల్లీకి చేరిన విశాల్ రాజీనామా పంచాయతీ
By: Tupaki Desk | 6 Dec 2017 5:51 PM GMTఆర్కే నగర్ ఉప ఎన్నికల బరిలో నిలిచే ముందే..అనేకానేక...ట్విస్టుల పరంపర ఎదుర్కుంటున్న సినీనటుడు విశాల్ ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. విశాల్ నామినేషన్ ను తమిళనాడు రాష్ట్ర ఎన్నికల అధికారులు తిరస్కరించడం... ఆమోదించడం...మళ్లీ తిరస్కరించడం వంటి ట్విస్టుల మీద ట్విస్టులు నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామంపై విశాల్ పోరాటం మొదలుపెట్టారు. ఢిల్లీలోని భారత ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.
ఢిల్లీలోని సీఈసీకి ఫిర్యాదు చేసిన విశాల్... కావాలనే తన నామినేషన్ పత్రాలను తిరస్కరించారని, న్యాయం చెయ్యాలని భారత ఎన్నికల కమిషన్ అధికారులను కోరాడు. విశాల్ ఫిర్యాదు స్వీకరించిన సీఈసీ వెంటనే రంగంలోకి దిగి విచారణ మొదలు పెట్టింది. తమిళనాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామిని భారత ఎన్నికల కమిషన్ సంప్రదించారు. విశాల్ నామినేషన్ పత్రాలు ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో ఆరాతీశారు. అయితే విశాల్ నామినేషన్ పత్రాల్లో ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచే వారి వివరాలు అసమగ్రంగా ఉండటం - ఇతరత్రా సాంకేతిక కారణాలను తమిళనాడు రాష్ట్ర ఎన్నికల రిటర్నింగ్ అధికారి వేలుస్వామి ఢిల్లీ అధికారులకు వివరించారు. తమిళనాడు అధికారుల వివరణను తీసుకున్న భారత ఎన్నికల కమిషన్ ప్రతినిధి తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.
కాగా, నామినేషన్ పత్రాల్లో ఇద్దరు స్థానికుల సంతకాలను ఫోర్జరీ చేయడంతో విశాల్ నామినేషన్ తిరసరిస్తున్నట్లు ఎన్నికల అధికారి ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరిణామాలపై విశాల్ మండిపడ్డారు. నామినేషన్ తిరస్కరణ తీరు సరికాదన్నారు. తన నామినేషన్ పత్రాలు తిరస్కరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని విశాల్ ఆరోపించారు. తన నామినేషన్ పత్రాలను తిరస్కరించడంతో ప్రజాస్యామ్యానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని విశాల్ ఆరోపించారు. నామినేషన్ తిరస్కరించిన సందర్భంపై విశాల్ తీవ్రస్థాయిలో రాత్రి ట్వీట్ చేశారు. `డిసెంబర్ 5 - 2016న అమ్మ (జయలలిత) చనిపోయింది. డిసెంబర్ 5 - 2017న ప్రజాస్వామ్యం చనిపోయింది` అంటూ విరుచుకుపడుతూ ట్వీట్ చేశారు.