Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని మోదీకి విశాల్ సూటి ప్ర‌శ్న‌!

By:  Tupaki Desk   |   26 May 2018 6:45 AM GMT
ప్ర‌ధాని మోదీకి విశాల్ సూటి ప్ర‌శ్న‌!
X
త‌మిళ యువ హీరో విశాల్ - స‌మంత ల కాంబోలో మిత్ర‌న్ తెర‌కెక్కించిన `అభిమ‌న్యుడు` చిత్రం జూన్ 1న తెలుగులో విడుద‌ల కానుంది. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ మే 11న త‌మిళ‌నాడులో విడుద‌లై ఘ‌న విజ‌యం సాధించింది. ఈ సినిమా విడుద‌ల‌కు సంబంధించి హైద‌రాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో హీరో విశాల్ - స‌మంత‌ - సీనియ‌ర్ హీరో అర్జున్ పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీపై హీరో విశాల్ మండిప‌డ్డారు. త‌మిళ‌నాడులో తూత్తుకుడిలో ప్ర‌జ‌ల‌పై కాల్పులు జ‌రిపేందుకు అనుమ‌తిని ఎవ‌రిచ్చార‌ని మోదీని ప్ర‌శ్నించారు. 13 మంది అమాయ‌కుల మృతికి మోదీ - త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం - కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌న్నారు. త‌మిళ‌నాడులోని తూత్తుకుడిలో జ‌రిగిన ఘ‌ట‌న చరిత్ర పుస్త‌కాల్లో లిఖిస్తార‌ని....వీరంతా క‌లిసి ప్ర‌జాస్వామ్యాన్ని ఖూనీ చేశార‌ని మండిప‌డ్డారు. సెల‌బ్రిటీగా కాద‌ని....ఒక ఓట‌రుగా తాను ప్ర‌శ్నిస్తున్నాన‌ని అన్నారు.

వాస్త‌వానికి `అభిమ‌న్యుడు` ఆడియో లాంచ్ కార్య‌క్ర‌మాన్ని గ్రాండ్ గా శుక్ర‌వారం నిర్వ‌హించాల‌ని భావించామ‌ని విశాల్ అన్నారు. కానీ, తూత్తుకుడిలో మృతిచెందిన వారికి సంతాపం తెలుపుతూ దానిని క్యాన్సిల్ చేశామ‌ని చెప్పారు. చివ‌రి నిమిషంతో ఆ ప్రోగ్రామ్ ను ర‌ద్దు చేశామ‌ని - అందుకు అంగీక‌రించిన నిర్మాత హ‌రి - డిస్ట్రిబ్యూట‌ర్ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న కెరీర్ లో క‌లెక్ష‌న్ల ప‌రంగా - రివ్యూల ప‌రంగా ఇదే బెస్ట్ మూవీ అని అన్నారు. ఈ సినిమాలో ఆధార్ కు వ్య‌తిరేకంగా - డిజిట‌ల్ ఇండియాకు వ్య‌తిరేకంగా సన్నివేశాలున్నాయ‌ని త‌మిళ‌నాడులో కొంద‌రు అభ్యంత‌రం చెప్పార‌న్నారు. సినిమా చూసిన త‌ర్వాత వారి అభిప్రాయం మార్చుకున్నార‌ని అన్నారు.కంటెంట్ ఉన్న ఉన్న సినిమాల‌ను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌ని, త‌మ సినిమా కూడా తెలుగు ప్రేక్ష‌కుల‌కు త‌ప్ప‌క న‌చ్చుతుంద‌ని విశాల్ అన్నారు. ఈ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఉంద‌ని, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పారు. స‌మాజంలో జ‌రిగే మంచి..చెడుని...చూపించ‌డానికి సినిమా ఒక మాధ్య‌మ‌మ‌ని అన్నారు. డిజిట‌ల్ ఇండియాకు మ‌నం సిద్ధంగా ఉన్నామా....ఏటీఎంలలో ఫ్రాడ్...బ్యాంకుల్లో రైతుల‌కు లోన్లు రావ‌డానికి ప‌డే ఇబ్బందులు...ప్ర‌స్తుతం స‌మాజంలోజ‌రిగే విష‌యాలను చెప్పామ‌న్నారు.