Begin typing your search above and press return to search.
దాడి జరిగిన ఇన్నాళ్లకు పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటమా విష్ణు?
By: Tupaki Desk | 5 March 2021 2:30 PM GMTఏపీ బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి తాజాగా బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ కు వెళ్లారు. కొద్ది రోజుల క్రితం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానల్ లో పాల్గొన్న చర్చ వేదికలో తనతో పాటు చర్చకు కూర్చున్న శ్రీనివాసరావు చెప్పుతో దాడి చేసిన వైనంపై ఆయన కంప్లైంట్ ఇచ్చారు. ముందస్తు పథకం ప్రకారమే తనపై చెప్పుతో దాడి చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు.
తనపై దాడి చేసిన శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాల్సిందిగా విష్ణు కోరారు. తనతో చర్చలో పాల్గొన్న శ్రీనివాసరావు తనపై దాడి చేయటం ద్వారా తన ప్రతిష్ఠను దెబ్బ తీశారన్నారు. ఈ ఉదంతంతో తాను భౌతికంగా.. మానసికంగా కలత చెందినట్లుగా ఆయన పేర్కొన్నారు. విష్ణు ఇచ్చిన ఫిర్యాదును తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ జరుపుతామని చెప్పారు. ఇంతకూ.. కొద్ది రోజుల క్రితం జరిగిన విషయంపై ఇప్పుడే కేసు పెట్టాలని విష్ణుకు ఐడియాకు ఎందుకు వచ్చిందంటారు?