Begin typing your search above and press return to search.
రాయితీలు నేతలకు మాత్రమే.. ప్రజలకు వద్దట
By: Tupaki Desk | 1 July 2016 8:00 AM GMTఇటీవల కాలంలో కొందరు ప్రజాప్రతినిధుల చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీస్తున్నాయి. ప్రజలకు రాయితీలు ఇవ్వడం అనవసరమని నేతలు అంటుండడంపై చర్చ జరుగుతోంది. నిజానికి దీనిపై గతంలోనూ భిన్నాభిప్రాయాలున్నప్పటికీ ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసిన నేతలు కూడా ప్రభుత్వాల నుంచి ఎన్నో రాయితీలు పొందుతున్నవారు కావడంతో వారికి రాయితీలపై మాట్లాడే అర్హత ఉందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి - బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజులు ప్రజలకు రాయితీలు అవసరం లేదని అంటున్నారు. జేసీ అయితే, ఇటీవల కాలంలో పదేపదే ఇదే మాట చెబుతున్నారు.
రూపాయికి కిలో బియ్యం ఇవ్వడం అవసరమా అని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పదే పదే ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. ఉచిత విద్యుత్ ఇవ్వడం కూడా వేస్టని అంటున్నారు. కూలీలు కూడా ఐదు రూపాయలు పెట్టి టీ తాగుతున్న ప్రస్తుత తరుణంలో రూపాయికి బియ్యం ఇవ్వడం అవసరమా అని జేసీ ఎన్నో సార్లు ప్రశ్నించారు. మరి జేసీని చూసి ప్రభావితం అయ్యారో లేదంటే తనకూ అలాంటి అభిప్రాయాలే ఉన్నాయో తెలియదు కానీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా ఇప్పుడు ఇదే రాగం అందుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం వల్ల ప్రజలు సోమరిపోతుల్లా మారిపోతున్నారని ఆయన అంటున్నారు. ఈ ఇద్దరి నేతల వ్యాఖ్యలపై విమర్శలు వినిపిస్తున్నాయి. పథకాల వల్ల కొందరు అనర్హులు లబ్ధి పొందడం అనేది ఎప్పుడూ ఉంటుందని.. అదేసమయంలో నిజమైన అర్హులు ఎందరో పథకాల వల్ల లబ్ధి పొందుతారని అంటున్నారు.
అయితే.. రాయితీ పథకాలపై గొంతెత్తుతున్న ఎంపీ జేసీ ఒక విషయం మాత్రం మరిచిపోతున్నారు. ఐదు రూపాయలుపెట్టి టీ తాగే పేదోడికి రూపాయి బియ్యం అవసరమా అంటున్న ఆయన ఎంపీగా తాను ఢిల్లీలో ఎలాంటి సేవాలు పొందుతున్నారో.. దేశంలో ఎలాంటి రాయితీలు పొందుతున్నారో మాత్రం చెప్పరు. ఆ రాయితీలు తనకు అవసరం లేదని త్యాగం కూడా చేయలేరు. పార్లమెంట్ క్యాంటీన్ లో ఎంపీలకు ఐదు రూపాయలకే ఫుల్ మీల్స్ - 20 రూపాయలనె చికెన్ బిర్యాని - ఒక రూపాయికే కాఫీ .. ఇలా పేదోళ్ల కంటే పేదోళ్లలా రాయితీలు అనుభవిస్తున్నారు.
పేదలకిచ్చే సబ్సిడీలన్నీ ఎత్తివేయాలని డిమాండు చేస్తున్న విష్టుకుమార్ రాజు కూడా ఎమ్మెల్యేగా సబ్సిడీలు పొందుతున్నారు. సేవ పేరుతో ఎమ్మెల్యే పదవి పొంది లక్షలకు లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. పొరుగునే ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో లక్షల కోట్ల విలువైనా గ్యాస్ నిక్షేపాలను అంబానీలకు కట్టబెడితే తమ ప్రభుత్వంపై మాట్లాడలేని విష్ణుకుమార్ రాజు పేదల పథకాలను ఆడిపోసుకుంటున్నారని అంటున్నారు. ప్రజాప్రతినిధులుగా తాము తొలుత తమకు వర్తించే అన్ని రాయితీలను వదులుకుని ఆ తరువాత పేదలకు కల్పిస్తున్న రాయితీలపై మాట్లాడాలని అంటున్నారు.