Begin typing your search above and press return to search.
10.66 శాతం వృద్ధి రేటు ఉంటే ప్రత్యేక హోదా ఇకెందుకు..?
By: Tupaki Desk | 6 Feb 2019 5:25 PM GMTఏపీ అసెంబ్లీలో బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు చంద్రబాబు ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని, జనసేన అధినేత పవన్ కల్యాన్‌ను ఈ రోజు ఏకిపడేశారు. కేంద్రం సహకారంతో ఏపీ అభివృద్ధి చెందుతున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నిందలేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం సహకారం, నిధుల విడుదల కారణంగా ఏపీ 10.66 శాతం వృద్ధి రేటు సాధించిదని.. కేంద్రం - కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఏపీ ఎన్నో అవార్డులు అందుకుందని కూడా ఆయన అన్నారు. కేంద్రం నుంచి ఇవన్నీ పొందుతూనే తిరిగి మోదీ - అమిత్ షాలపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని విష్నుకుమార్ రాజు అన్నారు.
చంద్రబాబు హోదా విషయంలో మాట మార్చారని.. కేంద్రం హోదాకు బదులు ప్యాకేజీ ఇస్తామన్నప్పుడు అందుకు అంగీకరించిన చంద్రబాబు ఆ తరువాత మాట మార్చారని విష్ణకుమార్ రాజు అన్నారు. జగన్ హోదా నినాదం ఎత్తుకోవడంతో చంద్రబాబు కంగారు పడి మళ్లీ హోదా అంటూ రచ్చ చేస్తున్నారన్నారు. జగన్ కు ఎక్కడ పొలిటికల్ మైలేజ్ వస్తుందో అన్న ఉద్దేశంతో చంద్రబాబు మళ్లీ హోదా పోరాటం ప్రారంభించారన్నారు.
అయితే.. దీనిపై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ప్రతి విమర్శలు చేశారు. జగన్ ఎన్నడూ హోదా పేరెత్తలేదని.. అనంతపురం జిల్లాకు రాహుల్ వచ్చినప్పుడు టీడీపీ ఎండగడితే అప్పుడు జగన్ హోదా మాటెత్తారన్నారు. చంద్రబాబు మాత్రం కేంద్రంలోని నాయకులును, ప్రధానిని కలిసిన ప్రతిసారీ హోదా కావాలని కోరారన్నారు.
దీనికి సమాధానంగా విష్ణుకుమార్ రాజు తానేమీ జగన్‌ను వెనకేసుకు రావడం లేదంటూ... పవన్ విషయంలో టీడీపీ మళ్లీ మెత్తగా వ్యవహరిస్తోందన్నారు. ఆ రెండు పార్టీలూ పరస్పర విమర్శలు మానుకున్నాని.. అంతకుముందు పెద్దపెద్ద అరుపులతో విరుచుకుపడే పవన్ ఇప్పుడు టీడీపీపై నోరెత్తడం లేదని ఆయన అన్నారు. ఎన్నికలు వస్తుండడంతో ఆ రెండు పార్టీలు రహస్య అవగాహనకు వస్తున్నాయని పరోక్షంగా అన్నారు.