Begin typing your search above and press return to search.
బాబు మర్చిపోలేని మేలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 14 April 2018 7:00 AM GMTఏపీలో అధికార టీడీపీ - కొద్దికాలం కిందటి వరకు ఆ పార్టీ మిత్రపక్షమైన బీజేపీల మధ్య మాటల యుద్ధం భారీ స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఏ పార్టీకి ఆ పార్టీ ఎదుటివారిని ఇరకాటంలో పడేసేందుకు దొరికే ప్రతి అవకాశాన్ని ఫుల్లుగా వాడేసుకుంటోంది. ప్రధానంగా ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టులు అయిన అమరావతి నిర్మాణం - పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడంలో ఏపీ సర్కారు తీరును బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. దీనికి కౌంటర్ గా కేంద్రం తమకే మాత్రం సహాయం చేయలేదని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. ఈ విమర్శల పర్వంలో తాజాగా బీజేపీ ఎమ్మెల్యే చేసిన కామెట్లు ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంతో మేలు చేశాయని అంటున్నారు.
ఇంతకీ ఆ మేలు ఏంటంటే...పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం ఏ సహాయం చేయలేదని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తుంటే..దానికి కౌంటర్‌గా బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు అదే సమాచారంతో టీడీపీ అలర్ట్ అయింది. ఎలా అంటే...విష్ణుకుమార్ రాజు గణాంకాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకు ఏ విధంగా సహాయపడిందో వివరించారు. ఎప్పుడు, ఏ రూపంలో తాము సహాయ సహకారాలు అందంచామో విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ విషయాలు ఇన్నిరోజులు అధికారికంగా టీడీపీ సర్కారు వెల్లడించకపోవడం గమనార్హం. మరోవైపు నిబంధనల ప్రకారం కాకుండా పలు మీడియా సంస్థలకు ఇష్టానుసారం ప్రకటనలు ఇచ్చిన స్కాంను కూడా విష్ణు వెల్లడించారు. దీంతో సర్కారులో కలవరం మొదలైందని సమాచారం.
ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించే అధికారుల్లో కొందరు ఇలాంటి `సున్నితమైన` సమాచారాన్ని బీజేపీ ఎమ్మెల్యేకు అందించి ఉంటారని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి. ప్రాథమిక దశలో ఈ విషయం పసిగట్టాం కాబట్టి సరిపోయిందని పేర్కొంటూ...బీజేపీ ఎమ్మెల్యే విమర్శ చేసినప్పటికీ తమకు మేలు చేశారని అంటున్నాయి. ఇక నుంచి తమ నాయకుడు కొందరు అధికారులపై అనుమానపు చూపులతో వ్యవహరించడం ఖాయమని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు.