Begin typing your search above and press return to search.
కిరణ్ బాటలోనే బాబు..మోడీ ఫ్యాన్స్ చూస్తు ఊరుకోరు
By: Tupaki Desk | 2 April 2018 6:30 PM GMTఅధికార తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపనలు - ఎదురుదాడిపై మాజీ మిత్రపక్షమైన బీజేపీ సంయమనంగా వ్యవహరించవద్దని ఎదురుదాడి తప్పదని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.స్పష్టమైన కౌంటర్ ఇవ్వకపోతే నష్టపోతామని భావించి ఆ పార్టీల నేతలు అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్మయంత్రి చంద్రబాబు - టీడీపీ నేతలపై మండిపడుతున్నారు. తాజాగా బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీరును తప్పుపట్టారు. చంద్రబాబు వ్యాఖ్యలు ప్రజల్ని రెచ్చగొట్టే విదంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యవహరించినట్లే బాబు సైతం వ్యహరిస్తున్నారని ఆరోపించారు.
నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సమైక్యాంధ్ర ఉద్యమంలో ప్రజలు సుమారు సంవత్సరం పాటు చాలా అవస్థలు పడ్డారని విష్ణుకుమార్ రాజు గుర్తు చేశారు. ఇప్పుడు అదే పరిస్థితి తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. విద్యార్థులు వినూత్న నిరసనలు చేస్తే ముఖ్యమంత్రి సహకరిస్తామని అనటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. స్వయంగా ముఖ్యమంత్రి జపాన్ తరహా నిరసన చేయాలని అనటం ప్రజల్ని రెచ్చగొట్టడమే అని ఆయన తెలిపారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎక్కువ సేపు మాట్లాడుతూ తన నిరసన తెలియజేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.
మరోవైపు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ సైతం తెలుగుదేశం పార్టీపై మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మారిందని ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీపై నాలెడ్జ్ సెంటర్ నుండి విమర్శిస్తూ పుస్తకాలు రిలీజ్ చేయటం దారుణమన్నారు. మోడీ అభిమానులు చూస్తూ ఊరుకోరని, తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని ఆయన హెచ్చరించారు. కొందరి రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీని దోషిగా చూపిస్తూ అనేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఈ అనూహ్య రాజకీయ పరిణామాల గురించి ఎటువంటి సందేహాలు ఉన్నప్పటికీ వాటిని నేతల ద్వారా నివృత్తి చేసుకోవచ్చునని బీజేపీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.