Begin typing your search above and press return to search.
తెలుగు తమ్ముళ్లపై ఏపీ బీజేపీ నేతల ఫైర్
By: Tupaki Desk | 12 May 2017 7:20 AM GMTఏపీ బీజేపీకి చెందిన కొందరు నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. తెలుగు తమ్ముళ్ల తీరుపై వారు మండిపడుతున్నారు. విమర్శలకంటూ ఒక హద్దు ఉంటుందని.. రాజకీయ ప్రయోజనం కోసం మరీ ఇంత దిగజారుతారా? అంటూ తెలుగు తమ్ముళ్ల మీద ఏపీ బీజేపీకి చెందిన నేతలు గుర్రుగా ఉన్నారు. రాజకీయ ప్రత్యర్థులపై రాజకీయ విమర్శలు మామూలే అయినా.. దేశ ప్రధానితో భేటీ అయితే దాన్ని కూడా తప్పు పట్టటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న అధికారపక్ష నేతలు మరీ ఇలా మాట్లాడటం ఏమీ బాగోలేదన్న వాదనను వినిపిస్తున్నారు. ఏపీ టీడీపీ నేతల మాటలు వింటుంటే.. ఏపీకి సంబంధించినంత వరకూ ప్రధాని మోడీ అపాయింట్ మెంట్ ఎవరికి ఇవ్వాలో టీడీపీ నేతల్ని అడిగి ఇవ్వాలా? అంటూ వారు విరుచుకుపడుతున్నారు. ఏపీ విపక్ష నేత జగన్ ప్రధానితో భేటీ కావటంపై పలువురు టీడీపీ నేతలు విమర్శలు చేయటంపై ఏపీ కమలనాథులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.
అయినా.. ప్రధానిని ప్రతిపక్ష నేత కలిస్తే వచ్చే నష్టమేమిటని? ఏపీ టీడీపీ నేతలు ఎందుకంత ఉలికిపాటు అంటున్నారు. ఇదిలా ఉండగా.. ఏపీ బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ అయితే.. గుండెల్లోని అసంతృప్తిని బయటపెట్టేస్తూ.. పెదవి విప్పారు. టీడీపీ నేతల అనుమతి తీసుకొని అప్పాయింట్ మెంట్ ఇచ్చే దుస్థితిలో ప్రధాని మోడీ లేరన్న ఆయన.. జగన్ ప్రధానిని కలిస్తే వచ్చే నష్టమేమిటంటూ ప్రశ్నించారు. మంత్రి అచ్చెన్నాయుడు బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నారని విష్ణుకుమార్ రాజు అసహనం వ్యక్తం చేశారు.
వీరందరి మాటలు ఒక ఎత్తు అయితే.. అవకాశం వచ్చిన ప్రతిసారీ ఏపీ టీడీపీ నేతలకు పంచ్ లు ఇచ్చే ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు ఒక అడుగు ముందుకేసి మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని కలవటమే తప్పుగా ఏపీ టీడీపీ నేతల మాటలు ఉన్నాయని.. మరి.. ఆపార్టీకి చెందిన కొందరిని టీడీపీలో ఎలా చేర్చుకున్నారంటూ వేసిన పంచ్ ప్రశ్న టీడీపీ తమ్ముళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుందన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/