Begin typing your search above and press return to search.
కాకినాడ రచ్చ మొదలు..టీడీపీ వర్సెస్ బీజేపీ
By: Tupaki Desk | 20 Aug 2017 9:28 AM GMTసార్వత్రిక ఎన్నికల తర్వాత ఏపీలో జరుగుతున్న ఉప ఎన్నికలు,పురపాలక ఎన్నికలు మిత్రపక్షాలైన టీడీపీ-బీజేపీల మధ్య ఉన్న గ్యాప్ ను తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో తమను లైట్ తీసుకున్నారని ఇప్పటికే రగిలిపోతున్న బీజేపీ నేతలు...కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ అనుసరిస్తున్న విధానంపై ఏకంగా బహిరంగంగా తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. చోటా మోటా నేతలు కాకుండా ఏకంగా బీజేపీ శాసనసభాపక్ష నేత - ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలుగుదేశం పార్టీ తీరుపై మండిపడ్డారు.
విశాఖలో విలేఖరులతో మాట్లాడిన విష్ణుకుమార్ రాజు కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ వెన్నుపోటు రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. తమకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ రెబల్స్ ను రంగంలోకి దించుతోందని మండిపడ్డారు. పొత్తుల్లో భాగంగా కాకినాడలో 48 డివిజన్లకు బీజేపీకి 9 డివిజన్లను కేటాయించారన్నారు. తమకు కేటాయించిన స్థానాల్లో 8 డివిజన్లలో టీడీపీ రెబల్ అభ్యర్థులు పోటీకి నిలిచారని పేర్కొన్నారు. రెబల్స్ బరిలో ఉంటే ఆ పార్టీ పెద్దలు ఏం చేస్తున్నారని విష్ణుకుమార్ రాజు సూటిగా నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయంతోనే ఇదంతా జరుగుతోందని ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలు తమకు చేతకావని ఆయన చెప్పారు. టీడీపీ మిత్ర ధర్మానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తోందని విష్ణుకుమార్ రాజు తెలిపారు. డివిజన్ల సర్దుబాటు కుదిరిన అనంతరం టీడీపీ పోటీ చేసే స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారని, రెండు స్థానాల్లో సాంకేతికంగా సాధ్యం కానందున వారితో ప్రచారం నిలిపివేయించామని అన్నారు. టీడీపీ తీరును తాము గమనిస్తున్నామని, సరైన సమయంలో సరైన రీతిలో స్పందిస్తామని బీజేపీ శాసనసభ పక్ష నేత పి విష్ణుకుమార్ రాజు నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
ఇదిలాఉండగా నగరంలో 48 డివిజన్లలో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. పార్టీల తరుపున సీట్లు ఖరారు కాని కొందరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రతి డివిజన్‌లో 3 నుంచి ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు పోటీకి దిగడంతో ప్రధాన పార్టీలు ఆందోళనలో పడ్డాయి. స్క్రూట్నీ అనంతరం పలువురు ఉపసంహరించుకోవడం, ప్రచారానికి దూరంగా ఉండటంలో పార్టీలు రిలాక్స్ అయ్యాయి.